కోవిడ్ మృతులకు ఒక్కొక్కరికి రూ. 50వేలు.. పరిహారంపై సుప్రీంకోర్టు..

Published : Mar 15, 2022, 09:07 AM IST
కోవిడ్ మృతులకు ఒక్కొక్కరికి రూ. 50వేలు.. పరిహారంపై సుప్రీంకోర్టు..

సారాంశం

కరోనా మృతులకు ఇవ్వాల్సిన పరిహారంపై సుప్రీంకోర్టు మరోసారి స్పష్టతనిచ్చింది. మృతులు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున కుటుంబీకులు ఇవ్వాలని తెలిపింది. కుటుంబంలో ఇద్దరు చనిపోతే రూ.లక్ష అందించాలని ఆదేశించింది. 

ఢిల్లీ : covid-19 వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి రక్త సంబంధీకులకు చెల్లించాల్సిన పరిహారంపై గత ఉత్తర్వుల్లోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని Supreme Court తెలిపింది. రూ.50 వేల చొప్పున బాధిత కుటుంబానికి అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది. అస్సాం నుంచి దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎం.ఆర్ షా..జస్టిస్ బి.వి.నాగరత్న ధర్మాసనం సోమవారం ఈ విషయాన్ని తెలిపింది. మృతులకు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఎంత పరిహారం ఇవ్వాలో స్పష్టత లేదంటూ పిటిషనర్ పేర్కొన్నారు.

పిల్లలు ఎంతమంది ఉన్నప్పటికి కుటుంబంలో ఒకరు చనిపోతే రూ.50,000, ఇద్దరు మరణిస్తే లక్ష అందజేయాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తల్లిని, తండ్రిని కోల్పోయినట్లయితే…  రెండు deathsగా పరిగణించి రూ. లక్షను వారి సంతానానికి సమకూర్చాలని పేర్కొంది, తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన పదివేల మంది చిన్నారులను గుర్తించి వారికి పరిహారం అందజేయడంతో పాటు తగిన సహాయం అందజేయాలని జనవరి 19న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

పరిహారం కోసం ఇంత అనైతికమా?
కోవిడ్ మృతుల కుటుంబాలకు అందించే రూ.50 వేల పరిహారం పొందేందుకు కొందరు నకిలీ ధ్రువపత్రాలను సృష్టిస్తుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నైతిక విలువలు ఇంతలా దిగజారాయని  ఊహించలేదని పేర్కొంది. ఇదే విషయంపై అవసరమైతే కాగ్ దర్యాప్తుకు ఆదేశిస్తామని justice ఏంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇటువంటి అక్రమాల వెనుక ప్రభుత్వ అధికారులు తీవ్రంగా పరిగణించాలని ఆదేశించింది.  

మృతుల కుటుంబాలకు పరిహారం మంజూరుకు నిర్దిష్ట కాలపరిమితి నిర్దేశించాలన్న ప్రతిపాదనను ధర్మాసనం పరిశీలించాలని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. ఇలా చేస్తే నిజమైన అర్హులు గడువు మేరకు దరఖాస్తు చేసుకుంటారని తెలిపారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. 

ఇదిలా ఉండగా, మార్చి 8న దేశంలో కొందరు డాక్టర్లు Fake covid-19 Death Certificates జారీ చేస్తుండడం పట్ల Supreme Court ఆందోళన వ్యక్తం చేసింది. corona virus కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న నష్ట పరిహారాన్ని కాజేయడానికి నకిలీ డెత్ సర్టిఫికెట్లు పుట్టుకొస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి. నాగరత్నతో కూడిన ధర్మాసనం పేర్కోంది. 

నష్టపరిహారం కోరుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి నిర్థిష్ట కాల వ్యవధి ఉండాలని సూచించింది. ఏకంగా డాక్టర్లే నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు ఇస్తుండడం తీవ్రమైన విషయమని ధర్మాసనం తెలిపింది. దీనివల్ల అసలైన vicitmsకు అన్యాయం జరుగుతుందని వెల్లడించింది. గౌరవ్ బన్సల్ తో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు