జడ్జి పోస్టుల్లో ఖాళీలను భర్తీ చేయండి: కేంద్రానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ లేఖ

By Siva KodatiFirst Published Jun 26, 2021, 7:21 PM IST
Highlights

దేశంలోని హైకోర్టుల్లో జడ్జిల పోస్టుల భర్తీపై సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కొలిజియం సిఫారసులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థతో సంబంధం వున్న వారిని కరోనా వారియర్లుగా గుర్తించాలని  కోరారు

దేశంలోని హైకోర్టుల్లో జడ్జిల పోస్టుల భర్తీపై సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కొలిజియం సిఫారసులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థతో సంబంధం వున్న వారిని కరోనా వారియర్లుగా గుర్తించాలని  కోరారు. కోవిడ్‌తో ఉపాధి కోల్పోయిన జూనియర్ లాయర్లకు సాయం అందించాలని సీజేఐ విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానం సిబ్బంది కుటుంబసభ్యులకు టీకా ఇవ్వాలని ఆయన కోరారు. జాతీయ న్యాయ, మౌలిక వసతుల కార్పోరేషన్ ఏర్పాటు తుది దశలో వుందని.. నివేదిక సిద్దమైన తర్వాతే కేంద్రానికి సమర్పిస్తామని సీజేఐ వెల్లడించారు. 

click me!