భలే దంపతులు: భార్యను చెల్లెగా చూపించి యువకుడికిచ్చి పెళ్లి చేసి....

Published : Jun 26, 2021, 03:59 PM IST
భలే దంపతులు: భార్యను చెల్లెగా చూపించి యువకుడికిచ్చి పెళ్లి చేసి....

సారాంశం

రాజస్థాన్ లో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చెల్లెగా చూపించి ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత అసలు కథ బయటపడింది.

కోట: రాజస్థాన్ లో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చెల్లెగా చూపించి ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత వరుడి నుంచి నగదును, నగలను దోచుకుని భార్యాభర్తలిద్దరూ పారిపోయారు. తాను మోసపోయానని గుర్తించిన వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

రాజస్థాన్ రాష్ట్రంలోని కోట జిల్లా కునాడి పోలీసు స్టేషన్ పరిధిలో ఆ సంఘటన చోటు చేసుకుంది. రవి అనే యువకుడు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో దేవ్ రాజ్ సుమన్ అనే ఓ మ్యారేజీ బ్రోకర్ ను కలిశాడు. తన ఫొటోలు ఇచ్చాడు. ఆ సమయంలో ఓ పెళ్లి సంబంధాన్ని రవికి చూపించాడు. కోమల్ అనే యువతి ఫొటో కూడా చూపించాడు. రవికి కోమల్ నచ్చింది. 

పూర్తి వివరాలు అడిగితే తల్లిదండ్రులు లేరని, అన్నయ్య మాత్రమే ఉన్నాడని చెప్పాడు. దాంతో కోమల్ ను పెళ్లి చేసుకోవాలని రవి నిర్ణయించుకున్నాడు. వాళ్లను ఓ రెస్టారెంట్ లో కలిశాడు. తాము కట్నం ఇవ్వలేమని కోమల్ అన్నయ్య సోను కార్పరే చెప్పాడు. దానికి రవి అంగీకరించాడు. కొద్ది రోజుల క్రితం కోమల్, రవిల వివాహం ఓ గుడిలో సన్నిహితుల మధ్య జరిగిది.

కోమల్ తరుచుగా కార్పరేతో మాట్లాడుతూ ఉండేది. అన్నయనే కదా అని రవి భావిస్తూ వచ్చాడు. పెళ్లయిన మూడో రోజు కోమల్ కనిపించకుండా పోయింది. ఇంట్లోని రెండు లక్షల రూపాయలు డ్బబు, నగలు మాయమైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

దర్యాప్తు చేపట్టిన పోలీసులు తొలుత మ్యారేజీ బ్రోకర్ సుమన్ ను విచారించారు. తమకు ఎమీ తెలియదని, అందరు కస్టమర్ల మాదిరగానే వారికి కూడా పెళ్లి సంబంధం కుదిర్చి పెట్టానని అతను తొలుత చెప్పాడు. కానీ అతని ప్రవర్తనపై పోలీసులకు అనుమానం పోలేదు. దాంతో అతన్ని తమదైన శైలిలో విచారించారు. దాంతో అసలు కథ మొత్తం చెప్పాడు. 

సును కార్పరే, కోమల్ భార్యాభర్తలని, గతంలో ఇండోర్ లో ఉండేవారని చెప్పాడు. వారు తనను కలిసి సులభంగా డబ్బు సంపాదించే మార్గం చెప్పారని, తనకు ఎక్కువ రిస్క్ లేకపోవడంతో తాను అంగీకరించానని చెప్పాడు. సుమన్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు భార్యాభర్తలిద్దరినీ అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?