లిక్కర్ బాటిళ్లపై రూ. 10 చొప్పున గోవు పన్ను.. రాష్ట్ర బడ్జెట్‌లో నిర్ణయం.. ఏ పార్టీ ప్రభుత్వమో తెలుసా?

By Mahesh KFirst Published Mar 18, 2023, 4:07 PM IST
Highlights

సెక్యులర్ పార్టీగా పేర్కొనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు ప్రవేశపెడుతూ కీలక ప్రకటన చేశారు. అందులో లిక్కర్ బాటిల్ పై రూ. 10 చొప్పున గోవు సెస్ ఉంటుందని తెలిపారు.
 

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లిక్కర్ బాటిల్ పై గోవు పన్ను వేయనున్నట్టు ప్రకటించింది. దాన్ని కౌ సెస్‌గా పేర్కొంది. ప్రతి లిక్కర్ బాటిల్ పై రూ. 10 గోవు పన్ను (cow cess) విధించే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం గమనార్హం. సెక్యులర్ పార్టీ ఆచరణలో ఇలా ఉంటుందన్నమాట అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు కాంగ్రెస్ ప్రభుత్వ తొలి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 53,413 కోట్ల బడ్జెట్ సమర్పించిన సుఖ్విందర్ సింగ్ సుక్కు 135 నిమిషాలపాటు ప్రసంగించారు. భగవద్గీతలోని శ్లోకాన్ని పఠిస్తూ బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ బడ్జెట్‌లో లిక్కర్ బాటిల్ పై రూ. 10 మేరకు గోవు సెస్‌ను విధించనున్నట్టు తెలిపారు. 

Also Read: మళ్లీ కరోనా పంజా?.. కొత్తగా 841 కేసులు.. నెల క్రితం కొత్త కేసులు 156.. యాక్టివ్ కేసులు 5,389

ఈ గోవు సెస్‌తో రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ. 100 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. అలాగే, బడ్జెట్‌లో మహిళలకు రూ. 1,500 నెల పింఛన్‌ ప్రకటించారు. ఏడాదికి ఈ స్కీం కింద రూ. 416 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశార. ఈ బడ్జెట్‌లో ఇతర కీలక నిర్ణయాలు ఉన్నప్పటికీ కౌ సెస్ ప్రధానంగా హెడ్ లైన్స్‌లోకి వచ్చింది.

click me!