అప్పుడు బ్లడ్ మూన్.. ఇప్పుడు బ్లడ్ వోల్ఫ్ మూన్

Published : Jan 03, 2019, 04:43 PM IST
అప్పుడు బ్లడ్ మూన్.. ఇప్పుడు బ్లడ్ వోల్ఫ్ మూన్

సారాంశం

గతేడాది జనవరిలో  సూపర్ బ్లడ్ మూన్ అందరూ చేసే ఉంటారు. అచ్చం అలాంటిదే ఈ న్యూ ఇయర్ లో జనవరి మాసంలో మనకు కనువిందు చేయనుంది. 

గతేడాది జనవరిలో  సూపర్ బ్లడ్ మూన్ అందరూ చేసే ఉంటారు. అచ్చం అలాంటిదే ఈ న్యూ ఇయర్ లో జనవరి మాసంలో మనకు కనువిందు చేయనుంది. అత్యంత అరుదుగా కనిపించే చంద్రగ్రహణం ఈ నెల 20, 21వ తేదీల్లో వీనులవిందు చేయనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ అనే పేరు పెట్టారు.

ఇది మూడు ఈశెంట్ల కలయిక. చంద్రగ్రహణం, సూపర్ బ్లడ్ మూన్,వోల్ఫ్ మూన్ కలిస్తే.. ఈ అరుదైన సూపర్ బ్లడ్ వోల్ఫ్ మూన్ ఏర్పడుతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మనదేశంలో ప్రజలు పూర్తిగా చూసే అవకాశం లేదు. కొద్దిగా మాత్రమే కనపడే అవకాశం ఉంది. అమెరికా, యూరప్,ఆఫ్రికా ప్రజలకు మాత్రం ఇది పూర్తిగా కనిపిస్తుంది.

నేషనల్ జాగ్రఫిక్ ప్రకారం.. జనవరి 21 ఉదయం 10గంటలకు ఈ గ్రహణం మొదలౌతుంది. 62 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి ప్రక్రియకు 3గంటల 50 నిమిషాల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Holidays : తెలంగాణ ఉద్యోగులకు బంపరాఫర్... ఏప్రిల్ 23, 29 రెండ్రోజులు సెలవే..!
ఇదెక్క‌డి మాస్‌రా మామా.! కేఎఫ్ స్ట్రాంగ్ రూ. 110, బడ్వైజ‌ర్ ప్రీమియం రూ. 130 మాత్ర‌మే