సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు ఇక లేరు.. ఢిల్లీ ఎయిమ్స్‌లో తుది శ్వాస..

Published : Aug 15, 2023, 04:23 PM ISTUpdated : Aug 15, 2023, 04:31 PM IST
సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు ఇక లేరు.. ఢిల్లీ ఎయిమ్స్‌లో తుది శ్వాస..

సారాంశం

సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ మంగళవారం కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. సులభ్ ఇంటర్నేషనల్ కార్యాలయంలో జెండా ఎగురవేసే కార్యక్రమంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. 

సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. సులభ్ ఇంటర్నేషనల్ సెంట్రల్ ఆఫీస్‌లో జెండా ఎగురవేసిన తరువాత.. అతని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని, దీంతో అతన్ని ఎయిమ్స్‌లోచేరారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన రెండు రోజుల క్రితం పాట్నా వెళ్లినట్టు తెలుస్తోంది. 

బీహార్ లోని వైశాలి జిల్లా రాంపూర్ బాఘేల్ గ్రామంలో జన్మించిన పాఠక్.. 1964లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అతను పాట్నా విశ్వవిద్యాలయం నుండి 1980లో మాస్టర్స్ డిగ్రీని , 1985లో PhDని పూర్తి చేశారు. దేశంలోని పారిశుధ్య సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో 1970లో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్‌ను స్థాపించారు.

1991లో మాన్యువల్ స్కావెంజర్లను విముక్తి చేయడం, పునరావాసం కల్పించడం కోసం, పోర్-ఫ్లష్ టాయిలెట్ టెక్నాలజీని అందించారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం పాఠక్ చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును అందించింది. అలాగే.. పారిశుధ్యం,పరిశుభ్రత రంగంలో ఆయన చేసిన కృషికి వివిధ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..