అలా ఆత్మహత్య చేసుకున్నా.. కరోనా పరిహారం..!

Published : Sep 24, 2021, 07:52 AM ISTUpdated : Sep 24, 2021, 07:57 AM IST
అలా ఆత్మహత్య చేసుకున్నా.. కరోనా పరిహారం..!

సారాంశం

కోవిడ్ పాజిటివ్ అని తేలిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబసభ్యులూ రాష్ట్ర విపత్తు ప్రతి స్పందన నిధి కింద పరిహారం పొందడానికి అర్హూలేనని చెప్పారు

కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబీకులూ పరిహారం పొందడానికి అర్హులేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ పరిహారం అందించే విషయాన్ని పున పరిశీలించాలని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం సూచించిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు గురువారం ప్రమాణ పత్రం దాఖలు చేసింది.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ,ఐసీఎంఆర్ జారీ చేసిన మార్గ దర్శకాల ప్రకారం కోవిడ్ పాజిటివ్ అని తేలిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబసభ్యులూ రాష్ట్ర విపత్తు ప్రతి స్పందన నిధి కింద పరిహారం పొందడానికి అర్హూలేనని చెప్పారు. ఈ మేరకు కోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చు అని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అదనపు ప్రమాణ పత్రంలో పేర్కొంది.

ఇప్పటికే ఎస్ డీ ఆర్ఎఫ్ నుంచి కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించడానికి రాష్ట్రాలకు అనుమతించినట్లు కేంద్రం బుధవారం కోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఇది ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ వర్తించనుంది.

PREV
click me!

Recommended Stories

Most Expensive Things: ఇండియన్స్ సృష్టించిన అత్యంత ఖరీదైన అద్భుతాలు ఏంటో తెలుసా?
Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu