డీఎంకేలో అన్నదమ్ముల సవాల్.....బలప్రదర్శనకు అన్న రెడీ

By sivanagaprasad KodatiFirst Published Aug 20, 2018, 3:42 PM IST
Highlights

డీఎంకే పార్టీలో నెలకొన్న ఇంటిపోరు తారా స్థాయికి చేరుకుంది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్ష పదవి అన్నదమ్ముల మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. పార్టీ అధ్యక్ష పదవికి నువ్వా నేనా అన్న రీతిలో అన్నదమ్ములు సవాల్ విసురుకుంటున్నారు. అటు అళగిరి.....ఇటు స్టాలిన్ ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నారు. 

చెన్నై: డీఎంకే పార్టీలో నెలకొన్న ఇంటిపోరు తారా స్థాయికి చేరుకుంది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్ష పదవి అన్నదమ్ముల మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. పార్టీ అధ్యక్ష పదవికి నువ్వా నేనా అన్న రీతిలో అన్నదమ్ములు సవాల్ విసురుకుంటున్నారు. అటు అళగిరి.....ఇటు స్టాలిన్ ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నారు. 

అయితే గతంలో తన రాజకీయ వారసుడిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ను ఆనాటి పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ప్రకటించారు. కరుణానిధి తర్వాత పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ అని అంతా ఊహించారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తాను కూడా రేస్ లో ఉన్నట్లు పెద్ద  కుమారుడు ఎంకే అళగిరి ప్రకటించారు. సమావేశాల్లో సైతం ఎడమెుహం..పెడమెుహంగా ఉంటున్నారు.  

ఇటీవల డీఎంకే కార్యవర్గ సమావేశాన్ని అత్యువసరంగా నిర్వహించింది. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కే అన్బళగన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, అళగిరి,కనిమెళి, మరో సీనియర్ నేత దురైమురుగన్ తోపాటు మెత్తం 750 మంది కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. సమావేశం అనంతరం మున్మందు ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని విజయబావుటా ఎగురవేస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ప్రకటించారు.  

అత్యవసర సమయంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. స్టాలిన్ తన సోదరుడు అళగిరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయం అళగిరి వరకు చేరడంతో అమితుమీకి సిద్ధమయ్యారు..తానేంటో నిరూపించేందుకు రెడీ అయ్యారు. 

అళగిరి తన బలాన్ని నిరూపించుకునేందుకు సన్నద్దమవుతున్నారు. అందుకు లక్ష మంది మద్దతుదారులతో చెన్నై వేదికగా బల ప్రదర్శనకు దిగనున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ 5న చెన్నై మహానగరంలో శాంతి ప్రదర్శన ర్యాలీ ద్వారా తన సత్తా ఏంటో నిరూపించనున్నారు. ఈ ర్యాలీకి  లక్షమంది మద్దతుదారులు పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 

కరుణానిధి బ్రతికున్నప్పుడు దక్షిణాది జిల్లాల బాధ్యత స్టాలిన్ చూసేవారు. అయితే ప్రస్తుతం కాలం మారిందని తాను మదురై వంటి దక్షిణాది జిల్లాలకు మాత్రమే పరిమితంకాదని నిరూపించేలా అళగిరి బలప్రదర్శన ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతుంది. శాంతి ర్యాలీకి వేదిక రాజధానినే ఎంచుకోవడమే అందుకు నిదర్శనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  


మరోవైపు అళగిరి తనయుడు దురై దయానిధి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో చేసిన ఒక పోస్ట్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దురై దయానిధి తన ఫేస్ బుక్ ఖాతాలో బీజేపీకి అనుకూలంగా పోస్టు చేశారు. తన తాత, పార్టీ అధినేత కరుణానిధి జీవించి ఉంటే మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతికి పార్టీ కార్యక్రమాలన్నీ వాయిదా వేసి నివాళులు అర్పించేవారంటూ పేర్కొన్నారు. 

అంటే దురై దయానిధి బీజేపీపై తనదైన శైలిలో ప్రేమ ఒలకబోశారు. బీజేపీతో స్నేహానీకి పరోక్షంగా సిగ్నల్స్ ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న రాజకీయ పరిణామాలు దురై దయానిధి పోస్టులు చూస్తుంటే అళగిరి చేపట్టబోయే ర్యాలీ వెనుక కానీ.....సవాల్ వెనుక కమలనాథుల ప్రోత్సాహం ఉన్నట్లు తమిళనాట రాజకీయాల్లో చర్చ జోరుగా జరుగుతుంది.  
 

click me!