పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం.. ఇక శత్రువుల గుండెల్లో గుబులే

By Rajesh KarampooriFirst Published Jan 10, 2023, 11:14 PM IST
Highlights

స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-II మంగళవారం విజయవంతంగా ప్రయోగించబడింది. ఒడిశాలోని చాందీపూర్‌లోని ఐటీఆర్ కాంప్లెక్స్ నుంచి మంగళవారం రాత్రి 8:25 గంటలకు భారత సైన్యం, డీఆర్‌డీవో పృథ్వీ-2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించాయి.

పృథ్వీ-II ప్రయోగం: భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. దేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘పృథ్వీ-II ’ని  డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మంగళవారం రాత్రి 8:25 గంటలకు ఈ పరీక్షను నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

క్షిపణి అన్ని కార్యాచరణ, సాంకేతిక పారామితులను విజయవంతంగా ధృవీకరించింది. పృథ్వీ-II క్షిపణి యొక్క స్ట్రైక్ రేంజ్ దాదాపు 350 కి.మీ. పృథ్వీ-II క్షిపణి అనేది భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) చే అభివృద్ధి చేయబడింది. ఉపరితలం నుండి ఉపరితలం పై ప్రయోగించబడే బాలిస్టిక్ క్షిపణి ఇది. ఇది భారతదేశ పృథ్వీ క్షిపణి సిరీస్‌లో భాగం. ఇందులో పృథ్వీ-I, పృథ్వీ-II, పృథ్వీ-III , ధనుష్ ఉన్నాయి.

ప్రత్యేకత ఏమిటి?

పృథ్వీ-2 500 కిలోల వరకు పేలోడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం గలదు. పృథ్వీ II స్వదేశీంగా అభివృద్ధి చేసిన క్షిపణి. ఇది స్ట్రాప్ డౌన్ సీరియల్ నావిగేషన్ సిస్టమ్‌పై నడుస్తుంది.  గత ఏడాది జూన్‌లో ఒడిశాలోని చాందీపూర్ నుంచి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ను ప్రయోగించారు. క్షిపణి చాలా కచ్చితంగా లక్ష్యాన్ని చేధించగలదు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య, భారత్ తన క్షిపణి సామర్థాన్ని బలోపేతం చేయనున్నది.  

డిసెంబర్‌లో అగ్ని-5 విజయవంతం

అంతకుముందు..  గతేడాది డిసెంబర్‌లో సుదూర శ్రేణి ఉపరితలం నుంచి ఉపరితలానికి అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. దీని పరిధి 500 కి.మీ కంటే ఎక్కువ. 2012లో తొలిసారిగా ప్రయోగించిన అగ్ని-5కి ఇది తొమ్మిదో పరీక్ష. ఈ క్షిపణి బీజింగ్‌తో సహా చైనాలోని చాలా నగరాలను చేరుకోగలదు. ఇది కాకుండా, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్, అగ్ని-III యొక్క విజయవంతమైన శిక్షణ ప్రయోగం నవంబర్‌లో జరిగింది.

ఈ క్షిపణిని ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద 1983లో ప్రారంభించారు. ప్రాజెక్ట్ డెవిల్ కింద ఈ క్షిపణి తయారు చేయబడింది. ఇప్పటివరకు..ఈ క్షిపణి  రెండు డజనుకు పైగా విజయవంతమైన పరీక్షలు జరిగాయి. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పృథ్వీ 2 క్షిపణిని నిర్వహిస్తుంది. ఈ క్షిపణి బరువు 4600 కిలోలు. దీని పొడవు 8.5 మీటర్లు, వ్యాసం 110 సెంటీమీటర్లు.

నేటీ ప్రయోగం ప్రపంచ వ్యాప్తంగా క్షిపణుల రంగంలో భారతదేశం ఒక మైలురాయిగా నిలిచిందనే చెప్పాలి. రాబోయే యుద్ధాన్ని బుల్లెట్, గన్‌లతో కాదు, క్షిపణులతోనే గెలవగలమని ఈ దేశాలన్నింటికీ తెలుసు.అందుకే ప్రపంచ దేశాలన్నీ తమ సొంత జ్ఞాన నైపుణ్యాలతో క్షిపణుల అభివృద్ధి, క్షిపణుల పరీక్షల్లో నిమగ్నమయ్యాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం కూడా అదే స్థాయిలో శ్రమిస్తుంది. 

click me!