చెన్నై: పట్టాలు తప్పి.. పక్కకు ఒరిగిన సబర్బన్ రైలు, తప్పిన పెను ప్రమాదం

Siva Kodati |  
Published : Apr 24, 2022, 06:22 PM IST
చెన్నై: పట్టాలు తప్పి.. పక్కకు ఒరిగిన సబర్బన్ రైలు, తప్పిన పెను ప్రమాదం

సారాంశం

చెన్నైలోని బీచ్‌స్టేషన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. షెడ్ నుంచి వస్తున్న రైలు పట్టాలు తప్పి, పక్కకు ఒరిగిపోయింది. అయితే ఆ సమయంలో రైలులో ప్రయాణీకులెవరూ లేకపోవడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. 

తమిళనాడు (tamilnadu) రాజధాని చెన్నైలో (chennai) సబర్బన్ రైలు (suburban rail) పట్టాలు తప్పింది. చెన్నైలోని బీచ్ సబర్బన్ రైలు స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. షెడ్ నుంచి బీచ్ స్టేషన్‌కు వెళ్తున్న రైలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. అదృష్టవశాత్తూ రైలులో ప్రయాణీకులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు , సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. ఈ నెల 16న Dadar-Puducherry Express ట్రైన్ కి చెందిన మూడు కోచ్‌లు శుక్రవారం పట్టాలు తప్పాయి. ఇది ముంబైలోని మాతుంగా స్టేషన్ లో జరిగింది.  దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్.. ముంబై CSMT గడగ్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని Central Railway officials సమాచారం అందించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !