పోలీస్ స్టేషన్ లోనే ఎస్సై ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని దారుణం..

Published : Jun 05, 2021, 03:37 PM IST
పోలీస్ స్టేషన్ లోనే ఎస్సై ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని దారుణం..

సారాంశం

సర్వీస్ రివాల్వర్ తో సబ్ ఇన్ స్పెక్టర్ తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీ తూటా తగిలి ఆయన అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. మృతుడు పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్.

స్టేషన్ ఆవరణలోనే ఆయన అఘాయిత్యానికి పాల్పడడంతో ఢిల్లీ ఉలిక్కిపడింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. 

పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ కు 2017లో ఎస్సైగా రాహూల్ సింగ్ (31) బాధ్యతలు చేపట్టాడు. నాలుగేళ్లుగా ఒకే స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు. 

అయితే అకస్మత్తుగా శుక్రవారం స్టేషన్ ఆవరణలోనే తన సర్వీస్ రివాల్వర్ ను తీసుకుని రాహుల్ కాల్చుకుని ఆత్మహ్యకు పాల్పడ్డాడు. స్టేషన్ లో రక్తపు మడుగులో ఆయన పడి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న అతడి భార్య స్టేషన్ కు వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించింది. 

అయితే తన భర్త ఆత్మహత్యకు కారణం పని ఒత్తిడేనని ఆమె ఆరోపించింది. స్టేషన్ అధికారి (సీఐ) ఒత్తడితో తన బర్త ఆందోళనకు గురవుతున్నాడని ఆమె తెలిపింది. 
 
PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌