
న్యూఢిల్లీ: విద్యార్థులకు ఓ అంశం ఇచ్చి వ్యాసం రాయాలనే ప్రశ్న ఉండటం సర్వసాధారణం. సామాజిక అంశాన్ని ఇచ్చి పది మార్కుల ప్రశ్నగా దీన్ని ఇస్తుంటారు. ఈ ప్రశ్న ద్వారా విద్యార్థుల అవగాహనతోపాటు రాయడం, చదవడం వంటి సామర్థ్యాన్ని కూడా అధ్యాపకులు అంచనా వేస్తారు. ఇందులో భాగంగానే పెళ్లి అంటే ఏమిటీ? అనే ప్రశ్నకు సమాధానం రాయాలని ఓ ప్రశ్న పత్రం ఇచ్చారు. అందుకు సమాధానంగా ఆ విద్యార్థి రాసిన సమాధానం మాత్రం నెటిన్లను కడుపుబ్బ నవ్విస్తున్నది.
కానీ, ఆ పేపర్ వ్యాల్యుయేషన్ చేసిన వారు నాన్ సెన్స్ అని రాసి పది మార్కులకు సున్నా మార్కులు వేశారు.
పెళ్లి అంటే ఏమిటీ? అనే ప్రశ్నకు ఆ విద్యార్థి సమాధానం ఇలా రాశాడు. ‘‘అమ్మాయి నువ్వు ఇప్పుడు పెద్ద దానివి అయ్యావు. నీకు ఇంకా తినిపించడం మా వల్ల కాదు. నీకు తినిపించే ఓ పురుషుడిని వెతుక్కోవడం మంచిది.. ’ అని అమ్మాయికి తల్లిదండ్రులు చెప్పడంతో పెళ్లి అనే తంతు జరుగుతుంది’ అని ఆ స్టూడెంట్ రాశాడు. ‘నువ్వు ఇప్పుడు పెద్దవాడివి అయ్యావు. పెళ్లి చేసుకో.. పెళ్లి చేసుకో అని తల్లిదండ్రులు అరుస్తున్న ఓ పురుషుడిని ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి కలుస్తుంది. వారిద్దరూ ఒకరినొకరు పరీక్షించుకుంటారు. ఇద్దరూ సంతోషంతో నిండిపోతారు. అప్ప్ుడు కలిసి జీవించడానికి అంగీకరించుకుంటారు. ఆ తర్వాత పిల్లల కోసం ఓ నాన్‌సెన్స్ పని చేస్తారు’ అని ఓ రాసుకొచ్చాడు.
ఈ సమాధానాన్ని టీచర్ నాన్ సెన్స్ అని కొట్టేశారు. ఆ తర్వాత వచ్చి నన్ను కలువు అని ఓ వార్నింగ్ మెస్సేజ్ కూడా అందులో టీచర్ రాశారు.
Also Read: సేల్స్ మెన్ అవతారమెత్తిన మస్క్ మామా.. ‘ప్లీజ్ కొనండీ’ అంటూ ట్వీట్.. వైరల్...
ఈ పోస్టుకు కామెంట్లు మాత్రం విపరీతంగా వచ్చాయి. ఇది అమాయకత్వంతో కూడిన నిజాయితీ అని ఒకరు.. ఆ పిల్లాడి రెస్పాన్స్ నాకు చాలా నచ్చింది అంటూ ఇంకొకరు.. ఇలా కామెంట్లు చేశారు.