పరీక్షల్లో పాటలు రాసిన స్టూడెంట్.. టీచర్ రియాక్షన్ ఇదే..!

By telugu news teamFirst Published Apr 1, 2023, 12:25 PM IST
Highlights

చండీగఢ్ యూనివర్శిటీకి చెందిన ఒక విద్యార్థి పరీక్షల్లో రాసిన సమాధాన పత్రం వీడియె నెట్టింట వైరల్ గా మారింది. ఆ విద్యార్థి రాసిన సమాధానాల కారణంగానే అది వైరల్ కావడం విశేషం, 

పిల్లలకు స్కూల్లు... ఆ స్కూల్లో పిల్లలకు పరీక్షలు ఉండటం చాలా కామన్. పరీక్షల్లో సమాధానాలు రాకపోతే..కొందరు ఖాళీ పేపర్లు ఇస్తుంటారు. మరి కొందరు తమకు తోచింది రాసి వస్తూ ఉంటారు. తాజాగా ఓ పిల్లాడు... జావాబుగా.. సినిమాల్లో పాటలు రాశాడు. దీనిని టీచర్ వీడియో తీయగా... అది నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.....

 చండీగఢ్ యూనివర్శిటీకి చెందిన ఒక విద్యార్థి పరీక్షల్లో రాసిన సమాధాన పత్రం వీడియె నెట్టింట వైరల్ గా మారింది. ఆ విద్యార్థి రాసిన సమాధానాల కారణంగానే అది వైరల్ కావడం విశేషం, 

 

విద్యార్థి కేవలం మూడు సమాధానాలు రాశాడు, వాటిలో రెండు హిందీ సినిమా పాటలు. మొదటి సమాధానం 3 ఇడియట్స్ చిత్రం నుండి "గివ్ మీ సమ్ సన్‌షైన్; గివ్ మి సమ్ రెయిన్; గివ్ మి అదర్ ఛాన్స్; ఐ వాన్నా గ్రో అప్ వన్స్ ఎగైన్" అనే పాట.

రెండవ సమాధానంగా విద్యార్థి.. టీచర్ కి ఉపదేశం ఇచ్చాడు. తన పేపర్ కరెక్షన్ చేసే ఉపాధ్యాయులు చాలా తెలివిగలవారని పేర్కొన్నాడు. తాను కష్టపడలేకపోయానని.. తనకు ప్రతిభ లేదు అని పేర్కొనడం గమనార్హం. 

మూడవ సమాధానం మళ్ళీ హిందీ చిత్రం PK నుండి "భగవాన్ హై కహాన్ రే తూ" పాట. రాశాడు. ఆ టీచర్ అతనిని పాస్ చేయడం విశేషం.  మిగిలిన సమాధానాలు కూడా  రాయాల్సింది అంటూ...ఆ టీచర్ కామెంట్ చేయడం ఇక్కడ విశేషం.

click me!