ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థి హత్య.. ఈ దారుణానికి కారణమదేనా? 

Published : Jun 18, 2023, 11:43 PM IST
ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థి హత్య.. ఈ దారుణానికి కారణమదేనా? 

సారాంశం

ఢిల్లీ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ (ఎస్ఓఎల్)లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఓ విద్యార్థిని  ఆదివారం కత్తితో పొడిచి చంపబడ్డాడు. యూనివర్సిటీలోని ఆర్యభట్ట కళాశాల వెలుపల విద్యార్థిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. చనిపోయిన విద్యార్థిని పశ్చిమ్‌ విహార్‌కు చెందిన నిఖిల్‌ చౌహాన్‌గా గుర్తించారు. 

దేశ రాజధానిలోని ఢిల్లీ యూనివర్శిటీలో హత్య కేసు వెలుగు చూసింది. యూనివర్శిటీ సౌత్ క్యాంపస్‌లోని ఆర్యభట్ట కళాశాల వెలుపల విద్యార్థులు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఇంతలో ఒక విద్యార్థిపై దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో పశ్చిమ్‌ విహార్‌కు చెందిన నిఖిల్ చౌహాన్(19)అనే విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనకు సంబంధించి చరక్ పాలికా ఆస్పత్రి నుంచి తమకు కాల్ వచ్చిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఛాతీపై కత్తితో పొడిచి ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులకు సమాచారం అందించాడు. చనిపోయినట్లు వైద్యులు ప్రకటించినప్పటికీ.. ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు బృందాన్ని పంపించారు. చనిపోయిన వ్యక్తిని పశ్చిమ విహార్‌లో నివాసముంటున్న నిఖిల్ చౌహాన్ గా గుర్తించారు. నిఖిల్ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ (SOL)లో మొదటి సంవత్సరం BA (ఆనర్స్) పొలిటికల్ సైన్స్ విద్యార్థి అని పోలీసులు తెలిపారు.

వివరాలోకెళ్తే. సుమారు ఏడు రోజుల క్రితం.. కళాశాలలో నిఖిల్ స్నేహితురాలితో SOL విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడని, ఈ తర్వాత వారి మధ్య వాగ్వాదం జరిగింది. అంతటి ఆ వివాదం అక్కడితో ముగిసిందని నిఖిల్ భావించాడు. కానీ ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో నిఖిల్ ప్రియురాలితో అసభ్యంగా ప్రవర్తించిన అదే విద్యార్థి తన ముగ్గురు సహచరులతో కలిసి కళాశాల వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో మరోసారి వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి నిఖిల్ ఛాతీపై కత్తితో పొడిచాడు.  ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించే లోపే మరణించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులెవరూ అరెస్ట్ కాలేదు. నిఖిల్ మృతితో కుటుంబం షాక్‌కు గురైంది. అదే సమయంలో ఆర్యభట్ట కళాశాల యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu