బాంబే ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య... ఏడంతస్తుల హాస్టల్ భవనంపై నుంచి దూకి..

Published : Feb 13, 2023, 11:10 AM ISTUpdated : Feb 13, 2023, 11:11 AM IST
బాంబే ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య... ఏడంతస్తుల హాస్టల్ భవనంపై నుంచి దూకి..

సారాంశం

బొంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 18 ఏళ్ల విద్యార్థి తన హాస్టల్ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.  

బొంబాయి : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి (IIT-B)లో 18 ఏళ్ల విద్యార్థి ఆదివారం మధ్యాహ్నం ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లోని తన హాస్టల్ భవనంలోని ఏడవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థి అహ్మదాబాద్‌కు చెందినవాడని, పొవాయ్‌లోని ఐఐటీలో బీటెక్‌ చదువుతున్నాడని తెలిపారు. విద్యార్థి మూడు నెలల క్రితమే కోర్సులో చేరాడు. అతని మొదటి సెమిస్టర్ పరీక్షలు శనివారంతో ముగిశాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్యాంపస్‌కు చేరుకుని విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపామని, గుజరాత్‌లోని అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోవై పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి తెలిపారు.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు.. ఘటన స్థలంలో 27 ఫైరింజన్లు..

పోవై పోలీసులు ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా ఏడీఆర్ నమోదు చేశారు. చదువుల ఒత్తిడి వల్లే విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ జరుగుతోంది.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?