దేశ రాజధాని ఢిల్లీలో భారీగా భూప్రకంపనలు..

దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భూప్రకంపనలు వణికించాయి. ఈరోజు ఢిల్లీ-ఎన్సీఆర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Google News Follow Us

దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భూప్రకంపనలు వణికించాయి. ఈరోజు ఢిల్లీ-ఎన్సీఆర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల ఇళ్లలో వస్తువులు కదలడంతో ప్రజలు.. బయటకు పరుగులు తీశారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ఢిల్లీలో భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలను పోస్టు  చేశారు. ఇక, రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రతో ఈరోజు సాయంత్రం 4.08 గంటలకు హర్యానాలోని ఫరీదాబాద్‌లో భూకంపం చోటుచేసుకుందని  నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 

హర్యానాలోని ఫరీదాబాద్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ఫరీదాబాద్‌కు తూర్పున తొమ్మిది కిలోమీటర్లు, ఢిల్లీకి ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు వెలువడలేదు.

 

ఇక, ఇటీవల నేపాల్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించగా..ఢిల్లీతో పాటు ఉత్తర భారత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.