రన్‌వేపైకి వచ్చిన వీధి కుక్క.. తిరిగి వెనక్కి వెళ్లిపోయిన విస్తారా విమానం.. అసలేం జరిగిందంటే..

By Sumanth Kanukula  |  First Published Nov 14, 2023, 3:18 PM IST

ఎయిర్‌పోర్ట్‌లోని రన్ వేపై ఓ వీధి కుక్క కనిపించడం కలకలం రేపింది. దీంతో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం వెనుదిరగాల్సి వచ్చింది.


ఎయిర్‌పోర్ట్‌లోని రన్ వేపై ఓ వీధి కుక్క కనిపించడం కలకలం రేపింది. దీంతో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన గోవాలోని దబోలిమ్‌ ఎయిర్‌పోర్ట్‌‌లో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.  ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రన్‌వేపై వీధికుక్కను గుర్తించడంతో విస్తారా విమానం గోవాలోని దబోలిమ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయకుండా బెంగళూరుకు తిరిగి వచ్చిందని సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు.

సోమవారం మధ్యాహ్నం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్  దబోలిమ్‌ ఎయిర్‌పోర్ట్‌‌ రన్‌వేపై వీధికుక్కను గుర్తించారు. దీంతో విస్తారా ఎయిర్‌లైన్స్ విమానం పైలట్‌ను కొంతసేపు హోల్డ్ చేయమని అడిగారు. అయితే పైలట్ బెంగళూరుకు తిరిగి వెళ్లడానికి ప్రిఫర్ చేశారని గోవా విమానాశ్రయం డైరెక్టర్ ఎస్‌వీటీ ధనంజయరావు చెప్పారు. 

Latest Videos

విస్తారా విమానం యూకే 881 బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం మధ్యాహ్నం 12.55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3.05 గంటలకు తిరిగి వచ్చిందని సంబంధింత వర్గాలు తెలిపాయి. అయితే రెండు గంటల విరామం తర్వాత విమానం మళ్లీ గోవాకు బయలుదేరింది. బెంగళూరు నుంచి సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరి 6.15 గంటలకు గోవా చేరుకుందని వారు తెలిపారు.

click me!