కర్ణాటక రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్స్ : మంగళసూత్రాలు, మెట్టెలు ఓకే.. హిజాబ్ కు నో..

By SumaBala Bukka  |  First Published Nov 14, 2023, 2:13 PM IST

కర్నాటక ఎగ్జామినేషన్ అథారిటీ బోర్డులు మరియు కార్పొరేషన్‌ల కోసం రిక్రూట్‌మెంట్ పరీక్షల సమయంలో అన్ని రకాల హెడ్ కవర్‌లను నిషేధించింది.


కర్ణాటక : ఎగ్జామినేషన్ అథారిటీ (కెఈఏ) బ్లూటూత్ ఉపయోగించి కాపీయింగ్ కు పాల్పడుతున్న ఘటనల అణిచివేతలో భాగంగా బోర్డులు, కార్పొరేషన్‌ల నియామక పరీక్షలలో అన్ని రకాల హెడ్ కవర్‌లను నిషేధించింది. అయితే, రైట్‌వింగ్ సంస్థల నిరసనల నేపథ్యంలో మంగళసూత్రాలు, మెట్టెలను మాత్రం హాలులోకి అనుమతిస్తుంది.

ఎగ్జామ్ అథారిటీ.. డ్రెస్ కోడ్ నిషేధిత వస్తువుల జాబితాలో హిజాబ్‌ను స్పష్టంగా పేర్కొననప్పటికీ, రిక్రూట్‌మెంట్ పరీక్షల సమయంలో హెడ్ కవర్‌లకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలు దీనికి వర్తించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

Latest Videos

undefined

"తల, నోరు లేదా చెవులను కప్పి ఉంచే ఏదైనా వస్త్రం లేదా టోపీ" ధరించిన వారిని పరీక్ష హాల్‌లోకి అనుమతించబడరని కేఈఏ పేర్కొంది. బ్లూటూత్ పరికరాలను ఉపయోగించి పరీక్షల మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టడానికి చేసే ప్రయత్నంలో ఇది భాగమని ఆర్డర్ పేర్కొంది. అక్టోబర్‌లో జరిగిన రిక్రూట్‌మెంట్ పరీక్షల సందర్భంగా కేఈఏ హిజాబ్‌లను అనుమతించింది.

కుల గణనకు కాంగ్రెస్ డిమాండ్ చేయడం మిరాకిల్: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు అఖిలేష్ యాదవ్ కౌంటర్

ఇదిలా ఉండగా, నవంబర్ 5న జరిగిన కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో విద్యార్థినులను 'మంగళసూత్రం' తీసివేయాలని అధికారులు కోరడం వివాదంగా మారింది. వివాహిత హిందూ మహిళలు వివాహానికి చిహ్నంగా ధరించే మంగళసూత్రం, తాడుతో పాటు... విద్యార్థినులు చెవిపోగులు, గొలుసులు, కాలిపట్టాలు.. మట్టెలు సహా ఇతర ఆభరణాలను కూడా తీసివేయాలని ఒత్తిడి చేశారు. 

ఈ పరిణామంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే బసంగౌడ యత్నాల్ స్పందిస్తూ, ఈ నిబంధనలన్నీ కేవలం హిందువుల కోసమేనా? అని ఘాటుగా ప్రశ్నించారు.మంగళసూత్రం తీయమని కోరినట్లు తెలిపిన మహిళ మాట్లాడుతూ.. తనతో పాటు హిజాబ్ ధరించిన మహిళలను కూడా అధికారులు తనిఖీ చేశారని, అయితే వారిని ఏమీ తొలగించమని చెప్పకుండానే లోపలికి అనుమతించారని తెలిపింది.

ఆమె దీనిమీద ఆవేదన వ్యక్తం చేస్తూ.. "హిందూ సంస్కృతిలో, మంగళసూత్రాన్ని తీసేయడం అంటే సెంటిమెంట్ ఉంటుంది. తీయాల్సినప్పుడు మాత్రమే వాటిని తీస్తాం. కానీ ఈ పరీక్ష కోసం నాతో మంగళసూత్రం, కాలి మెట్టెలు తీయించారు. వాటిని తీసివేసి లోపలికి వెళ్ళాను. ముస్లిం మహిళల హిజాబ్‌ని ఎలా తనిఖీ చేసి అనుమతించారో, మమ్మల్ని కూడా అలాగే తనిఖీ చేసి లోపలికి అనుమతించాల్సింది" అని విద్యార్థి తెలిపింది.

ఈ ఘటన కేపీఎస్సీ పరీక్ష కలబురగిలోని బాలికల ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో జరిగింది. గ్రూప్ సి పోస్ట్ పరీక్షకు హాజరయ్యే మహిళా అభ్యర్థులు తమ మంగళసూత్రాలు, కాలి ఉంగరాలు, చెవిపోగులు, ఇతర లోహ వస్తువులను తీసివేయాలని.. తద్వారా పరీక్ష సమయంలో ఎటువంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని అధికారులు ఆదేశించారు.

click me!