స్ట్రెయిన్ ఎఫెక్ట్: రేపటి నుండి మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ

By narsimha lodeFirst Published Dec 21, 2020, 6:51 PM IST
Highlights

యూకేలో కరోనా విజృంభిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది.  ఈ నెల 22 వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు మహారాష్ట్ర అర్బన్ ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూను విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
 

ముంబై: యూకేలో కరోనా విజృంభిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది.  ఈ నెల 22 వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు మహారాష్ట్ర అర్బన్ ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూను విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

యూకేలో కరోనా విజృంభణతో ఇప్పటికే బ్రిటన్ నుండి వస్తున్న విమానాలపై  ఇండియా నిషేధం విధించింది. అర్బన్ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుండే జాగ్రత్తలు తీసుకొంటుంది.

బ్రిటన్ లో కరోనా కొత్త స్టేజ్ స్ట్రెయిన్ తో  తమ రాష్ట్రంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను ఈ నెల 22 నుండి జనవరి 5 వ తేదీ వరకు  రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు  కర్ఫ్యూ విధించారు.యూరప్ నుండి  వచ్చిన ప్రయాణీకులకు 14 రోజుల పాటు కచ్చితంగా క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం స్ట్రెయిన్ విషయంలో జాగ్రత్తలు తీసుకొంటుంది.

click me!