టుటికోరిన్‌ కేసులో రజనీకాంత్ కు సమన్లు..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 21, 2020, 04:19 PM IST
టుటికోరిన్‌ కేసులో రజనీకాంత్ కు సమన్లు..

సారాంశం

టుటికోరిన్‌లోని స్టెర్లైట్ ఫ్యాక్టరీలో 2018లో జరిగిన హింసాత్మక ఘటన కేసులో సూపర్ స్టార్ రజనీకాంత్ కు సమన్లు జారీ చేశారు. దీన్ని అధికారికంగా తూత్తుకుడి అని పిలుస్తారు. నిరసనకారులపై పోలీసులు అధిక శక్తిని ఉపయోగించకపోవడంపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు చేశారు. 

టుటికోరిన్‌లోని స్టెర్లైట్ ఫ్యాక్టరీలో 2018లో జరిగిన హింసాత్మక ఘటన కేసులో సూపర్ స్టార్ రజనీకాంత్ కు సమన్లు జారీ చేశారు. దీన్ని అధికారికంగా తూత్తుకుడి అని పిలుస్తారు. నిరసనకారులపై పోలీసులు అధిక శక్తిని ఉపయోగించకపోవడంపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు చేశారు. 

2018లోవేదాంత స్టెర్లైట్ కాపర్ మెల్టింగ్ ప్లాంట్ ను శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ నిరసనకారులు పోలీసులతో గొడవకు దిగారు. ఈ ఘటనలో 13 మంది మరణించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మహిళా జ్యుడిషియల్ ప్యానెల్ రజనీకాంత్‌ను దర్యాప్తుకు పిలిచారు. ఆ నిరసనలో "సంఘ విద్రోహ శక్తులు" ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యపై విచారణ జరిపారు. 

ఇంతకుముందు కూడా రిటైర్డ్ జడ్జి అరుణ జగదీషన్ రజనీకాంత్ ను కోర్టుకు హాజరు కావల్సిందిగా పిలిచారు. కానీ రజనీకాంత్ హాజరు కాకుండా మినహాయింపు కోరారు. తమిళనాడు పాలక ఎఐఎడిఎంకె ప్రభుత్వాన్ని ఉద్దేశించి రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని తీవ్రంగా ప్రశ్నించారు. 

పోలీసులు కాల్పులు జరిపే పరిస్థితిని సృష్టించేలా నిరసనకారులను రెచ్చగొట్టి 
పోలీసులు నిరసనకారులపై దాడి చేశారని, వాహనాలను తగలబెట్టారని స్థానికులు ఆరోపించారు.  రజనీకాంత్ వ్యాఖ్యలు వారిని తీవ్రంగా కలవరపెట్టాయి.

సంఘ విద్రోహులని ఎలా చెబుతున్నారన్నదానికి రజనీకాంత్ దగ్గర సమాధానం లేదు.  ఎలా తెలుసు అని అడగద్దు, నాకు తెలుసు.. ఆయన విలేకరులతో అన్నారు. యూనిఫాం ముసుగులో ప్రజలకు హాని చేసే వారిని తాను అంగీకరించనని ఆయన అన్నారు.

"ప్రజలు బయటకు వెళ్లి ప్రతిదానికీ నిరసనలు ప్రారంభిస్తే, తమిళనాడు మొత్తం స్మశానవాటిక అవుతుంది" అని రజనీకాంత్ అన్నారు, కొద్ది రోజుల క్రితం రాజకీయాల్లోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రజనీ వ్యాక్యలు మరోసారి తెర మీదికి వచ్చాయి. 

వాటిని ఉద్దేశించి రజనీకాంత్ మాట్లాడుతూ తన మాటలు పెద్ద వివాదానికి దారితీసినందుకు విచారం వ్యక్తం చేశారు. "నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే, చింతిస్తున్నాను" అని అన్నారు. అయితే సామాజిక వ్యతిరేక వ్యాఖ్యమీద వివరణ కానా, ఉపసంహరణ కానీ చేయలేదు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !