"ఆడపిల్లలను టార్గెట్ చేయ‌డం ఆపండి... వారిని జీవించనివ్వండి": మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు

Published : Mar 28, 2022, 12:11 PM IST
 "ఆడపిల్లలను టార్గెట్ చేయ‌డం ఆపండి... వారిని జీవించనివ్వండి": మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు

సారాంశం

Miss Universe 2021: ఆడ‌పిల్ల‌ను ట‌ర్గెట్ చేయ‌డం ఆపండి.. వారిని స్వేచ్ఛ‌గా జీవించ‌నివ్వండి అంటూ మిస్ యూనివ‌ర్స్ 2021 హ‌ర్న‌జ్ సంధు పిలుపునిచ్చారు. ఇటీవ‌ల ఉద్రిక్త‌ల‌కు దారితీసిన హిజాబ్ వివాదం నేప‌థ్యంలో ఆమె ఈ వ్యాఖ్య‌లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Hijab Row:  హిజాబ్ ధ‌రించ‌డం స‌హా వారి వ‌స్త్రాధార‌ణ వంటి ప‌లు విష‌యాల క్ర‌మంలో ఆడ‌పిల్ల‌ల‌ను టార్గెట్ చేయ‌డం మానేయాల‌ని మిస్ యూనివ‌ర్స్ 2021 హ‌ర్నాజ్ సంధు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. "ఆడపిల్లలను టార్గెట్ చేయ‌డం ఆపండి... వారిని జీవించనివ్వండి.. వారు ఎంచుకున్న విధంగా జీవించనివ్వండి" అని ఆమె పేర్కొన్నారు. మిస్ యూనివ‌ర్స్ 2021 గౌర‌వార్థం ఏర్పాటు ఏసిన ఓ క‌ర్యాక్ర‌మంలో హ‌ర్నాజ్ సంధు పై వ్యాఖ్య‌లు చేశారు. కాగా, క‌ర్నాట‌క తీవ్ర ఉద్రిక్త‌ల‌కు దారి తీసిన హిజాబ్ వివాదం తీవ్ర‌రూపం దాలుస్తూ.. ఇత‌ర రాష్ట్రాల‌కు సైతం పాకింది. ఈ క్ర‌మంలోనే న్యాయ‌స్థానాలు రంగంలోకి దిగాయి. హిజాబ్ వివాదంపై దాఖ‌లైన పిటిష‌న్ల‌ను విచారించిన అనంత‌రం క‌ర్నాట‌క హైకోర్టు తీర్పును వెలువ‌రిస్తూ.. విద్యాసంస్థల తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.. హిజాబ్ ధ‌రించ‌డం ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని, నిర్దేశించిన విద్యాసంస్థల్లో ఏకరీతి దుస్తుల నిబంధనను అనుసరించాలని పేర్కొంది.

హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో ప‌లువురు పిటిష‌న‌ర్లు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో హిజాబ్ వివాదం గురించి  మిస్ యూనివ‌ర్స్ హ‌ర్నాజ్ సంధు మీడియా  ప్ర‌తినిధి ఒక‌రు ప్ర‌శ్నించ‌గా.. దీనిపై ఆమె మాట్లాడ‌టానికి ముందే.. ఈ కార్య‌క్ర‌మ‌ నిర్వాహకుడు జోక్యం చేసుకుని, రాజకీయపరమైన ప్రశ్నలు అడగకుండా ఉండమని కోరారు.  ఆమె ప్రయాణం,  సాధించిన విజయాలు.. ఆమెకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన విష‌యాల‌ను ఆడ‌గాల‌ని సూచించారు. విలేఖరి స్పందిస్తూ, "హర్నాజ్ ను అదే విషయాలు చెప్పనివ్వండి.." అంటూ పేర్కొన్నారు. “ఎప్పుడూ అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇప్పుడు కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారు.. హిజాబ్ విషయంలో కూడా అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు.. వాళ్లను (అమ్మాయిలు) వారు ఎంచుకున్న విధంగా జీవించనివ్వండి, ఆమె తన గమ్యాన్ని చేరనివ్వండి. ఆమె ఈగ, అవి ఆమె రెక్కలు, వాటిని కత్తిరించవద్దు, మీరు తప్పక (ఎవరి రెక్కలను కత్తిరించినా) మీ స్వంతంగా కత్తిరించుకోండి" అని మిస్ యూనివ‌ర్స్ సంధు చెప్పారు. 


కాగా, ఇజ్రాయెల్‌లోని సౌత్‌మోస్ట్ సిటీ ఐలాట్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 'మిస్ యూనివర్స్ 2021' అందాల పోటీలో, భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు 'మిస్ యూనివర్స్ 2021' కిరీటాన్ని గెలుచుకుంది. చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ సంధు తనకు పోటీగా నిలిచిన పరాగ్వేకు చెందిన నదియా ఫెరీరా, దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా లాలీ మస్వానేపై వెనక్కి నెట్టి కీరిటం దక్కించుకున్నారు.  దాదాపు 21 సంత్సరాల తర్వాత..భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది.  మొత్తంగా దేశనికి మూడో మిస్ యూనివర్స్ కిరీటం హర్నాజ్ సంధు అదించారు. గతంలో  1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తాలు  Miss Universe కీరిటాన్ని అందుకున్నారు. ఈ ఏడాది ఇజ్రాయిల్ లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో  హర్నాజ్ కౌర్ ప్రపంచ సుందరిగా నిలిచారు. దాదాపు 80 మంది పోటీదారులతో పోటీపడి కిరీటాన్ని దక్కించుకుంది హర్నాజ్‌ కౌర్‌ సింధు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?