Omicron Variant: రాజకీయాలు వద్దు.. కొత్త వేరియంట్‌ను కట్టడి చేస్తాం: లోక్‌సభలో మన్సుఖ్ మాండవీయ

By Siva KodatiFirst Published Dec 3, 2021, 3:23 PM IST
Highlights

ఒమిక్రాన్ కట్టడికి కేంద్రం కట్టుబడి వుందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. ఒమిక్రాన్‌పై రాజకీయాలు చేయడం తగదని ఆయన మండిపడ్డారు. 

ఒమిక్రాన్ కట్టడికి కేంద్రం కట్టుబడి వుందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. ఒమిక్రాన్‌పై రాజకీయాలు చేయడం తగదని ఆయన మండిపడ్డారు. 

కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) మన దేశంలోకి ప్రవేశించిన తర్వాత దాని నివారణపై జోరుగా సాగుతున్నది. ప్రస్తుత టీకాలు(Vaccines) ఒమిక్రాన్ వేరియంట్‌ను నిలువరించగలవా? బూస్టర్ డోసు(Booster Dose) ఇవ్వక తప్పదా? వంటి చర్చలు జరిగాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిల్లలకు టీకా పంపిణీ చేపట్టే కార్యక్రమంతోపాటు బూస్టర్ డోసు, అదనపు డోసులు అందించడంపై వ్యూహాలు రచిస్తున్నది.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలకమైన పరిశోధన సంస్థ జీనోమ్ కన్సార్టియం ముఖ్యమైన సూచనలు చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల ద్వారా స్వల్ప స్థాయిలోనే యాంటీబాడీలు వస్తున్నాయని, వాటితో ఒమిక్రాన్ వేరియంట్‌ను నిలువరించడం కష్టమేనని తెలిపింది. కాబట్టి, బూస్టర్ డోసు అందించాని సూచనలు చేసింది. అంతేకాదు, ఎవరికీ బూస్టర్ డోసు ఇవ్వాలనే విషయంపైనా వివరణలు ఇచ్చింది. 

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, కొత్త సవాళ్లు వంటి విషయాలను ఇండియన్ సార్స్ కోవ్2 జీనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్) ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. వైరస్ వ్యాప్తితోపాటు దాని పరిణామం, మార్పులను పరిశీలించి దాన్ని ఎదుర్కోవడానికి తగిన సూచనలు, సలహాలను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలోకి ఎంటర్ అయిన నేపథ్యంలో తాజాగా కీలక సూచనలు చేసింది.

ALso Read:Omicron: ఈ టీకాలు ఒమిక్రాన్‌ను నిలువరించలేవ్.. ‘బూస్టర్’ ఇవ్వండి: కేంద్రానికి జీనోమ్ కన్సార్టియం సూచనలు

ముందు ఇప్పటికే టీకా తీసుకోకుండా హైరిస్క్‌లో ఉన్నవారికి టీకా వేయాలని తెలిపింది. అలాగే, 40ఏళ్లు పైబడిన వారికి  బూస్టర్ డోసు అందించాలని సూచించింది. అంతేకాదు, ఈ వేరియంట్ బారిన పడే అవకాశాలు ఎక్కుగా ఉండేవారికి (ఉదాహరణకు వైద్యులు) బూస్టర్ డోసు వేయాలని పేర్కొంది. ఎందుకంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల స్వల్ప స్థాయి యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను నాశనం చేయడం కష్టమేనని తెలిపింది. అయితే, ఒమిక్రాన్ వల్లే  కలిగే రిస్క్‌ను ఈ టీకాలు తగ్గిస్తాయనడంలో సందేహం లేదని వివరించింది.

కాగా, వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో జీనోమిక్ సర్వెలెన్స్ కీలకమని ఇన్సాకాగ్ వెల్లడించింది. అవసరమైన ఆరోగ్య పరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ వైరస్ ఎక్కువగా ఉన్న చోట్ల నుంచి రాకపోకలు జరిపిన వారిని పర్యవేక్షించాలని, కరోనా కేసులతోపాటు వైరస్ బారిన పడిన వారి  కాంటాక్టులను వేగంగా ట్రేస్ చేయాలని వివరించింది. వీటికితోడు టెస్టుల సంఖ్యను పెంచడంతోపాటు పాజిటివ్ అని తేలిన వారికి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం తప్పకుండా పంపాలని పేర్కొంది.
 

click me!