భారత్ లో చోరీ.. 20 యేళ్ల తరువాత ఇటలీలో దొరికిన 12 వందల యేళ్ల పురాతన బుద్ధ విగ్రహం..

Published : Feb 12, 2022, 09:02 AM ISTUpdated : Feb 12, 2022, 09:04 AM IST
భారత్ లో చోరీ..  20 యేళ్ల తరువాత ఇటలీలో దొరికిన 12 వందల యేళ్ల పురాతన బుద్ధ విగ్రహం..

సారాంశం

మిలన్ లోని భారత్ కాన్సులేట్ దేశం గర్వించే విషయాన్ని చెప్పింది. పన్నెండువందల యేళ్ల పురాతన చరిత్ర కలిగిన బౌద్ధ విగ్రహాన్ని తిరిగి సంపాదించింది. 20 యేళ్ల క్రితం ఈ విగ్రహం చోరీకి గురయ్యింది. 

న్యూఢిల్లీ : భారత్ నుండి అక్రమంగా రవాణా అయిన Ancient statue మిలన్‌లోని Consulate of India స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు శుక్రవారం వివరాలు వెల్లడించింది. 12వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన.. ప్రాశస్త్యం కలిగిన 'అవలోకితేశ్వర పదమపాణి' విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహం 20 యేళ్ల కిందట దొంగిలించబడింది. 

భారత్ ఎంతో పురాతన సంపదకు నిలయం.. వేలయేండ్ల క్రితం నాటి చారిత్రక విగ్రహాలు, ఆనవాళ్లు ఇక్కడి దేవాలయాల్లో భద్రంగా ఉంటాయి. అయితే అలాంటి వాటి మీద అంతర్జాతీయ దొంగల కన్ను పడింది. అలా ఎన్నో విగ్రహాలను స్మగ్లింగ్ పేరుతో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అలాంటి వాటిల్లో ఒకటే 12వందల యేళ్ల చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ బుద్ధ విగ్రహం. వీటిల్లో ఏవో శక్తులు ఉంటాయనో.. వాటి చారిత్రక ప్రాశస్త్యం దృష్ట్యానో చాలామంది వీటిని అక్రమంగా దొంగిలించి, విదేశాలకు తరలిస్తూ ఉంటారు.

ఆర్ట్ స్మగ్లర్స్ కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించి.. వీటిని అక్రమరవాణాకు తెరతీస్తుంటారు. అలా 20యేళ్ల క్రితం భారత్ లోని ఓ ఆలయం నుంచి అత్యంత చాకచక్యంగా ఈ విగ్రహాన్ని దొంగిలించి.. విదేశాలకు తరలించారు. అప్పటినుంచి దీని గురించి వెతుకుంటే ఇప్పటికి దొరికింది. 

"2000 ప్రారంభంలో దొంగిలించబడి, అక్రమంగా భారతదేశం నుండి 
Smuggling చేయబడింది. అప్పటివరకు ఈ విగ్రహం దాదాపు 1200 సంవత్సరాల క్రితం నుంచి దేవీస్థాన్ కుందుల్పూర్ ఆలయంలో పూజలందుకుంటూ ఉండేది" అని పేర్కొంది.

కాన్సులేట్ ఇంకా ఇలా చెప్పింది, "ఈ రాతి విగ్రహం 8వ-12వ శతాబ్దానికి చెందినది. అవలోకితేశ్వరుడు తన ఎడమ చేతిలో వికసించిన కమలం కాండం పట్టుకుని నిలబడి ఉన్నట్లు ఈ విగ్రహాన్ని చెక్కారు" బౌద్ధమతంలో, అవలోకితేశ్వరుడు అన్ని బుద్ధుల కరుణను మూర్తీభవించిన బోధిసత్వుడుగా చెబుతారు.

"ఈ శిల్పం మిలన్ ఇటలీలో కంటే ముందు.. ఫ్రాన్స్‌లోని ఆర్ట్ మార్కెట్‌లో చక్కర్లు కొడుతోందని తెలిసింది. ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్, సింగపూర్, ఆర్ట్ రికవరీ ఇంటర్నేషనల్, లండన్‌లు దొంగిలించబడిన విగ్రహాన్ని గుర్తించి, తిరిగి భారత్ కు అందించడంలో తమ సహకారాన్ని వేగంగా అందించాయి" అని కాన్సులేట్ ఒక ప్రకటనలో తెలిపింది.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !