రైతులకు ఊరట.. ఏడాది పాటు సాగు చట్టాలు నిలిపివేత: మోడీ ప్రకటన

By Siva KodatiFirst Published Jan 30, 2021, 3:22 PM IST
Highlights

అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులలో చర్చలకు సిద్ధమని మోడీ వ్యాఖ్యానించారు. రైతుల అభ్యంతరాలను పరిశీలిస్తామని మోడీ చెప్పినట్లుగా తెలుస్తోంది

అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులలో చర్చలకు సిద్ధమని మోడీ వ్యాఖ్యానించారు. రైతుల అభ్యంతరాలను పరిశీలిస్తామని మోడీ చెప్పినట్లుగా తెలుస్తోంది.

అలాగే రైతులకు కేంద్రం ఇచ్చిన ఆఫర్‌కు ఇప్పటికీ కట్టుబడి వుందని వెల్లడించారు. రైతుల సమస్యలకు చర్చలతోనే పరిష్కారమని ప్రధాని చెప్పారు. ఏడాది పాటు కొత్త సాగు చట్టాల అమలు నిలిపివేతకు సిద్ధమని ఆయన ప్రకటించారు.

బడ్జెట్‌లో రైతులకు వరాలు ప్రకటిస్తామని... రైతులతో మాట్లాడటానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా వుంటుందని మోడీ పేర్కొన్నారు. రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని.. అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చలకు సిద్ధమని ప్రధాని వెల్లడించారు.

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషీ సమక్షంలో ఉభయ సభలకు చెందిన నేతలతో ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా రైతుల ఆందోళన , ఎర్రకోట ముట్టడి వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

రెండు నెలల పాటు ఆందోళన కొనసాగించడం సరికాదని, వారి సమస్యలకు పరిష్కారం సూచించాలని పలువురు  నేతలు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

click me!