ఢిల్లీ పేలుళ్లు: రంగంలోకి ఇజ్రాయెల్ టీమ్ .. ఘటనా స్థలిలో పరిశీలన

By Siva KodatiFirst Published Jan 30, 2021, 2:36 PM IST
Highlights

ఢిల్లీ పేలుళ్ల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ బృందం ఘటనా స్థలికి చేరుకుంది. ఎన్ఐఏ, ఐబీ అధికారులు పేలుడు జరిగిన ప్రాంతాన్ని చూపించారు. ఇప్పటికే ఘటనాస్థలిలో క్లూస్ కొన్నింటిని సేకరించారు. 

ఢిల్లీ పేలుళ్ల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ బృందం ఘటనా స్థలికి చేరుకుంది. ఎన్ఐఏ, ఐబీ అధికారులు పేలుడు జరిగిన ప్రాంతాన్ని చూపించారు.

ఇప్పటికే ఘటనాస్థలిలో క్లూస్ కొన్నింటిని సేకరించారు. లెటర్‌తో పాటు సగం కాలిన పింక్ దుప్పట్టాను స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో లభించిన లేఖలో ఇది ట్రైలర్ మాత్రమేనని రాసినట్లు గుర్తించారు.

Also Read:ఢిల్లీ పేలుళ్లు : ఇద్దరు అనుమానితుల గుర్తింపు.. ట్రయల్ మాత్రమే !

ఇజ్రాయెల్ రాయబారిని హెచ్చరిస్తూ ఈ లేఖ రాశారు. ఇరాన్ అగ్రశ్రేణి మిలటరీ అధికారి ఖాసీం సులేమానీ పేరుని ఇందులో ప్రస్తావించారు. ఆయన హత్యకు ప్రతీకారంగానే దాడి చేసినట్లుగా అనుమానిస్తున్నారు.

మరోవైపు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు పోలీసులు. దానిలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్థదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. ప్రైవేట్ క్యాబ్‌లో వచ్చినట్లుగా గుర్తించిన అధికారులు.. క్యాబ్ డ్రైవర్‌ను ప్రశ్నించనున్నారు. మరోవైపు భారత దర్యాప్తు సంస్థలపై తమకు నమ్మకం వుందన్నారు ఇజ్రాయెల్ ప్రతినిధి. 
 

click me!