వైద్యుల నిర్లక్ష్యం.. తెగిపడిన కడుపులో బిడ్డ తల

By ramya N  |  First Published Mar 21, 2019, 9:29 AM IST

ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా.. కడుపులో బిడ్డ కడుపులోనే కన్నుమూసింది.  మరికొద్ది నిమిషాల్లో భూమి మీదకు వచ్చి ప్రపంచాన్నిచూడాల్సిన పసికందు.. తల్లి కడుపులోనే రెండు ముక్కలయ్యింది. 



ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా.. కడుపులో బిడ్డ కడుపులోనే కన్నుమూసింది.  మరికొద్ది నిమిషాల్లో భూమి మీదకు వచ్చి ప్రపంచాన్నిచూడాల్సిన పసికందు.. తల్లి కడుపులోనే రెండు ముక్కలయ్యింది. ఈ విషాదకర సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...కల్పాక్కం సమీపంలోని కడలూరుకు చెందిన బొమ్మి (28)ని బుధవారం ఉదయం ప్రసవం కోసం కూవత్తురు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడంతో నర్సులే బొమ్మిని పరీక్షించి ప్రసవం చేయడానికి సిద్ధపడ్డారు.

Latest Videos

ఆపరేషన్‌ థియేటర్‌లో పురుడు పోస్తున్న సమయంలో గర్భాశయం నుంచి కొద్దిగా బయటకు వచ్చిన శిశువు తలను పట్టుకుని బలంగా లాగారు. దీంతో మొండెం నుంచి తల తెగిపోయి బయటకు వచ్చింది. మిగిలిన దేహం గర్భాశయంలోనే ఉండిపోయింది. భయాందోళనలకు గురైన నర్సులు ఆస్పత్రి వైద్యులకు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. 

శిశువు మొండెం గర్భాశయంలోనే ఉండిపోవడంతో బొమ్మి కుటుంబీకులు ఆమెను వెంటనే చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి శిశువు దేహాన్ని వెలికి తీశారు. ప్రస్తుతం బొమ్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సులు, విధులకు హాజరుకాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు.

click me!