గోద్రా రైలు దగ్దం కేసు: యాకూబ్ పాటలియాకు జీవిత ఖైదు

Published : Mar 20, 2019, 02:29 PM ISTUpdated : Mar 20, 2019, 02:30 PM IST
గోద్రా  రైలు దగ్దం కేసు: యాకూబ్ పాటలియాకు జీవిత ఖైదు

సారాంశం

గోద్రా అల్లర్ల కేసులో  నిందితుడుగా ఉన్న యాకూబ్ పాటాలియాకు సిట్ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదును విధిస్తూ  బుదవారం నాడు తీర్పు చెప్పింది.


న్యూఢిల్లీ:  గోద్రా అల్లర్ల కేసులో  నిందితుడుగా ఉన్న యాకూబ్ పాటాలియాకు సిట్ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదును విధిస్తూ  బుదవారం నాడు తీర్పు చెప్పింది.

2002లో శబరిమల ఎక్స్‌ప్రెస్ రైలును దగ్ధం చేసిన కేసులో యాకూబ్ పాటాలియా ప్రధాన ముద్దాయి. ఈ కేసులో గుజరాత్ పోలీసులు 2018 జనవరి మాసంలో  యాకూబ్‌ను అరెస్ట్ చేశారు.

2002 ఫిబ్రవరి 27వ తేదీన గోద్రాకు సమీపంలో శబరిమల ఎక్స్‌ప్రెస్ రైలును దగ్ధం చేశారు. ఈ ఘటనలో సుమారు 59 మంది మృతి చెందారు.
ఈ కేసులో మరో ఇద్దరు కూడ  జీవిత ఖైదును విధించింది కోర్టు. ఈ కేసులో మరో ముగ్గురిని  కోర్టు నిర్ధోషిగా  విడుదల చేసింది.

అయోధ్యలో కరసేవ చేసి శబరి ఎక్స్‌ప్రెస్ రైలులో తిరిగి వస్తున్న కరసేవకులను లక్ష్యంగా చేసుకొని శబరి ఎక్స్‌ప్రెస్‌ను దగ్దం చేశారు. ఈ ఘటన 2002 ఫిబ్రవరి 27వ తేదీన చోటు చేసుకొంది.

ఈ ఘటన తర్వాత  రాష్ట్రంలో అల్లర్లు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో సుమారు వెయ్యి మంది మరణించారు.  ఇందులో ఓ వర్గానికి చెందిన వారు ఉండడం గమనార్హం.గోద్రా ఘటనపై సిట్  విచారణ జరిపింది.  ఈ కేసులో 31మందిని నిందితులుగా సిట్ తేల్చింది.
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం