నాలుగు నెలలుగా సవతి కూతురిమీద తండ్రి అత్యాచారం..అరెస్ట్...

By SumaBala BukkaFirst Published Dec 15, 2022, 8:31 AM IST
Highlights

ఓ సవతి తండ్రి కూతురి మీద దారుణానికి పాల్పడ్డాడు. నాలుగు నెలలుగా ఆమె మీద అత్యాచారం చేస్తున్నాడు. వారినుంచి తప్పించుకున్న ఆ 15యేళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

రాజస్థాన్‌ : రాజస్థాన్‌లోని కోటాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి గత కొన్ని నెలలుగా తన 15 ఏళ్ల సవతి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ మేరకు లైంగికంగా దోపిడీకి పాల్పడుతున్నాడన్న కారణంతో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
ప్రాథమిక విచారణ అనంతరం మంగళవారం రాత్రి నిందితుడిని అరెస్టు చేసి బుధవారం కోర్టు ముందు హాజరుపరిచామని, జ్యుడీషియల్ కస్టడీ కింద జైలుకు పంపాలని ఆదేశించినట్లు ఎస్‌హెచ్‌ఓ అమర్‌నాథ్ జోగి తెలిపారు.

చనిపోయిన తన తల్లి తరఫు బంధువులతో కలిసి బాధితురాలు ఆదివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తన సవతి తండ్రిపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిందని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. గత 3-4 నెలలుగా తన సవతి తండ్రి తనపై పదేపదే అత్యాచారం చేస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని మైనర్ తెలిపింది. తల్లి చనిపోయిన తరువాత ఆమె స్కూల్ మానేసిందని తెలిపింది.

దారుణం.. బీమా డబ్బుకు ఆశపడి స్నేహితుడిని హత్య చేసి, యాక్సిడెంట్ గా చిత్రీకరించి.. చివరికి...

ఈ వేధింపులు భరించలేక.. ఆమె గతవారం సవతి తల్లిదండ్రుల ఇంటి నుండి తప్పించుకుంది. ఈ క్రమంలో ఓ పోలీసు కానిస్టేబుల్ ను ఆమె కలిసింది. అతని సహాయంతో, ఆమె తల్లి తరఫు అత్త వరుసయ్యే బంధువు ఇంటికి చేరుకుంది. ఆ టీనేజ్ అమ్మాయి చెప్పిందంతా విని ఆమె షాక్ అయ్యింది. వెంటనే ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లింది.

సదరు కీచకతండ్రిపై ఐపీసి, పోక్సో, ఎస్సీఎస్టీ, జేజే యాక్ట్ లతో పాటు కనీసం 10 సెక్షన్ల కింద అత్యాచారం కేసు నమోదు చేయబడింది. ఆ అమ్మాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురానికి వైద్య పరీక్షలకు పంపించారు. సోమవారం సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడికి నేర చరిత్ర ఉంది. దశాబ్దం క్రితం అతను బాధితురాలి తల్లితో పారిపోయాడు. ఆ తరువాత అతను పెట్టే హింసలకు తట్టుకోలేక ఆమె చనిపోయింది. ఆ తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని అధికారి తెలిపారు.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపును కాపాడేందుకు వివరాలు తెలుపలేదు)

click me!