ఒడిశా వాసి ప్రైవేట్ పార్ట్‌లో స్టీల్ గ్లాస్.. పది రోజుల తర్వాత సర్జరీతో తొలగింపు

By Mahesh KFirst Published Aug 22, 2022, 12:50 PM IST
Highlights

ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి పొట్టలో స్టీల్ గ్లాస్ కనిపించింది. మందు పార్టీ చేసుకున్న సమయంలో ఓ మిత్రుడు రాక్షసానందంతో మత్తులో ఉన్న  ఆ వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌లో గ్లాస్ చొప్పించాడు. ఆ తర్వాతి రోజు నుంచి సదరు వ్యక్తికి పొట్ట నొప్పి వచ్చింది. హాస్పిటల్ వెళితే సర్జరీ చేశారు.

భువనేశ్వర్: ఓ వ్యక్తికి ఉన్నట్టుండి పొట్టలో తీవ్రమైన నొప్పి వచ్చింది. భరించలేని నొప్పితో ఏ పనీ చేయలేకపోయాడు. ఉదయం పూట కాళ్లకృత్యాలు తీర్చుకోవడం కూడా కష్టమైపోయింది. అంతేకాదు, కొన్ని రోజులకు పొట్ట వాచిపోవడం గమనించాడు. ఇక ఆలస్యం చేయవద్దని ఓ హాస్పిటల్‌లో చేరాడు. ఎక్స్‌రే తీస్తే వారికి షాకింగ్ విషయం తెలిసిందే. ఆయన పొట్టలో స్టీల్ గ్లాస్ కనిపించింది. ముందుగా ఆయన ప్రైవేట్ పార్ట్ నుంచి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ, అందులో సఫలం కాలేరు. దీంతో సర్జరీ చేసి దాన్ని తొలగించారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

ఒడిశాలో బెర్హంపూర్‌లోని గాంజామ్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల కృష్ణ రౌత్ గుజరాత్‌లోని సూరత్‌కు వలస వెళ్లి పని చేసుకుంటూ ఉండేవాడు. ఆయన సూరత్‌లో పని చేసుకుంటూ ఉండగా పది రోజుల క్రితం మిత్రులతో కలిసి ఓ పార్టీ చేసుకున్నాడు. ఆ పార్టీలో వారంతా మద్యం తాగారు. అంతా మత్తులో ఉన్నారు. ఆ సమయంలో కృష్ణ రౌత్ మిత్రుడు ఒకడు రాక్షసానందం కోసం పరితపించాడు. కృష్ణ రౌత్ లిక్కర్ తాగి మత్తులో ఉన్నప్పుడు ఓ మిత్రుడు ఆయన గుదములోకి స్టీల్ గ్లాస్ చొప్పించాడు. దాని గురించి కృష్ణ రౌత్‌కు అవగాహన లేకపోయింది. కానీ, తర్వాతి రోజు నుంచి ఆయన ఉదరంలో నొప్పి రావడం మొదలైంది.

కొన్ని రోజులు చూసి నొప్పి భరించలేకుండా మారినప్పుడు ఆయన తిరిగి తన స్వగ్రామం గాంజామ్‌కు తిరిగి వచ్చాడు. ఇంట్లో వాళ్లకు ముందుగా ఈ విషయం చెప్పలేడు. కానీ, పొట్ట వాచి.. ఉదయం టాయిలెట్ వెళ్లడం కూడా ఇబ్బందిగా మారింది. అప్పుడు విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. వారు హాస్పిటల్ వెళ్లాల్సిందిగా సూచనలు చేశారు. దీంతో ఆయన చెకప్ కోసం ఎంకేసీజీ మెడికల్ కాలేజీకి వెళ్లాడు. వైద్యులు ఆయనకు ఎక్స్ రే తీశారు. ఆ రిపోర్టులో ఓ గ్లాసు పేగుల్లో ఉన్నట్టు గుర్తించారు. ఆ గ్లాస్‌ను ఆయన ప్రైవేట్ పార్ట్ నుంచి బయటకు తీయడానికి వైద్యులు ప్రయత్నించారు. కానీ, అది సాధ్య పడలేదు. దీంతో వైద్యులు ఆయనకు సర్జరీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణ రౌత్ అనుమతితో ఆ సర్జరీ చేశారు. ఇంటెస్టిన్‌ను కట్ చేసి స్టీల్ గ్లాస్‌ను బయటకు తీశారు. కృష్ణ రౌత్ ప్రస్తుతం ఆ సర్జరీ నుంచి కోలుకుంటున్నాడు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉన్నట్టు హాస్పిటల్ వర్గాలు వివరించాయి.

click me!