బాలికను వెంబడించి, కిడ్నాప్ చేసి అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ.. మరోసారి..

Published : Sep 06, 2022, 11:15 AM IST
బాలికను వెంబడించి, కిడ్నాప్ చేసి అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ.. మరోసారి..

సారాంశం

రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో దారుణం జరిగింది. 11వ తరగతి చదువుతున్న బాలికను ఓ వ్యక్తి అపహరించి, అత్యాచారం చేశాడు. అదంతా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. 

రాజస్థాన్‌ :  మహిళలు, బాలికలు, చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలోని రామ్‌దేవ్రా గ్రామంలోని పొలాల్లో పనిచేస్తున్న ఒక మైనర్ బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. దీనికి ముందు నెల రోజుల పాటు ఆమెను వెంబడించాడు. ఆ దారుణాన్నంతా వీడియో తీశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అసభ్యకర వీడియోను లీక్ చేస్తానని బెదిరించాడు. బాధితురాలు తన తండ్రితో కలిసి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెడితే.. ఆగస్టు 31న బాలిక పాఠశాలకు వెళ్తుండగా నిందితుడు ఆమెను ఆపి, రాత్రి ఫోన్‌లో మాట్లాడకుంటే ఆమె అసభ్యకర వీడియో తన దగ్గర ఉందని దాన్ని వైరల్ చేస్తానని బెదిరించాడు. భయంతో, ఆ అమ్మాయి అతను చెప్పినట్టుగా అతనితో రాత్రిపూట ఫోన్ మాట్లాడింది. ఇంటినుంచి బైటికి రావాలని పిలిచారు. ఆ తరువాత ఆమెను కారులో అపహరించి రామ్‌దేవ్రా గ్రామంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు.

దారుణం.. త‌ల్లిని చంపి మూడు రోజుల త‌రువాత కుమారుడి ఆత్మ‌హ‌త్య‌.. 77 పేజీల సూసైడ్ నోట్ ల‌భ్యం

అక్కడ బాలిక మీద అత్యాచారం చేసి.. ఆ తర్వాత, అపస్మారక స్థితిలో ఉన్న బాలికను అలాగే పొలాల్లో వదిలేసి పారిపోయాడు. పొలాల్లోంచి బాలిక కేకలు విన్న చుట్టుపక్కల జనాలు అతడిని వెంబడించగా, నిందితుడు వారికి దొరకకుండా పారిపోయాడు. కాగా,  అతని కారు పొలాల్లో దొరికింది. అయితే, 10 రోజుల క్రితం నిందితులు తనపై అత్యాచారం చేసి అసభ్యకరమైన వీడియో తీశారని బాధితురాలు పేర్కొంది. ఆ వీడియోతో తనను బెదిరించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆమె తెలిపింది.

“బినాసర్‌కు చెందిన ఒక యువకుడు తన కుమార్తెను పాఠశాలకు వెడుతున్నప్పుడు వెంబడిస్తున్నట్లు బాధితురాలి తండ్రి చెప్పారు. వేరేవారినుంచి  అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకుని ఈ వేధింపులకు పాల్పడ్డాడు”అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) సుఖరామ్ చోటియా చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu