ప్రేయసికి మరొకరితో పెళ్లి.. ఆమెను చంపాలనుకుని.. తాను కాలి బూడిదై... ఓ ప్రేమికుడి దారుణం..

Published : Mar 30, 2022, 10:57 AM IST
ప్రేయసికి మరొకరితో పెళ్లి.. ఆమెను చంపాలనుకుని.. తాను కాలి బూడిదై... ఓ ప్రేమికుడి దారుణం..

సారాంశం

తనను ప్రేమించిన వ్యక్తి మరొకరిని పెళ్లి చేసుకోవడం సహించలేకపోయాడా వ్యక్తి.. అందుకే ఆమెను అంతం చేయాలనుకున్నాడు. దీంతో ఆమె ఇంటికి నిప్పు పెట్టి.. తానూ పెట్రోల్ పోసుకుని అంటించుకున్నాడు. 

కేరళ : ప్రేమించిన వ్యక్తి సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా.. కానీ అతడు మాత్రం.. తనను దక్కని ప్రియురాలు చావాలని కోరుకున్నాడు. అందుకే తన friend మరొకరిని వివాహం చేసుకుంటుందని ఆమెను murder చేయాలనుకున్నాడు ఓ వ్యక్తి.  ఈ క్రమంలో ఆయన ప్లాన్ విఫలమై తానే నిప్పంటించుకుని చనిపోయాడు. ఈ దారుణ ఘటన కేరళలోని కోజికోడ్ లో జరిగింది. నడపురం గ్రామంలో రత్నేష్ (41) ఎలక్ట్రీషియన్గా పనిచేసే వాడు. తన స్నేహితురాలిని వివాహం చేసుకోవాలని  అనుకున్నాడు. కానీ దానికి పెద్దలు ఒప్పుకోలేదు.  ఆమెకు మరొకరితో  వివాహం నిశ్చయమైంది.  ఏప్రిల్ లో ఆమె పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. అయితే ఇది సహించలేని రత్నేష్…  తనకు దక్కని  ప్రేయసి బతికి ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఆమెను హత్య చేయాలని murder plan చేశాడు.  

మంగళవారం  వేకువజామున  రెండు గంటల సమయంలో బాధిత మహిళ ఇంటికి వెళ్ళాడు. సహాయంతో ఆమె ఇంటి రెండో అంతస్తు ఎక్కి బెడ్రూమ్ కు fire అంటించాడు. గమనించిన ఇంటి పక్క వ్యక్తి అందరినీ పిలిచాడు. ఆ ఇంటి వైపు అందరూ పరుగులు పెడుతూ వస్తుండగా నిందితుడు తన ఒంటిపై petrol పోసుకుని నిప్పంటించుకున్నాడు. అందరూ చూస్తుండగానే  మంటల్లో కాలిపోయాడు. ఈ ఘటనలో బాధిత మహిళ ఆమె సోదరుడు గాయాలపాలయ్యారు. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉండగా, నిరుడు అక్టోబర్ లో ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ప్రియురాలిని హత్య చేసిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.  ఈ ఘటన ఛజలత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  ఈ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఒక మహిళ మృతదేహం  పొలంలో పాతిపెట్టిన స్థితిలో కనిపించింది. గ్రామస్థులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ మృతురాలిని ఉత్తరాఖండ్ లోని రుద్రపూర్ కు చెందిన ashadeviగా గుర్తించామని తెలిపారు.

ఆమెకు మురాదాబాద్ కు చెందిన గజరాజు తో వివాహం అయింది.  18 ఏళ్ల క్రితమే ఆమెను గజరాజ్ విడిచిపెట్టేశాడు.  ఆతర్వాత గజరాజు కు వరుసకు సోదరుడైన Satpal, ఆశా దేవికి love affair ఉంది. ఈ ప్రేమవ్యవహారంతో వారిద్దరూ కొద్దికాలం కలిసి సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఆశాదేవి తనను వివాహం చేసుకోవాలని సత్పాల్ పై ఒత్తిడి తీసుకు రాసాగింది.

అలాగే సత్పాల్ పేరిట ఉన్న భూమిని తన పేరుమీద రాయాలని డిమాండ్ చేసింది ఈ నేపథ్యంలో సత్పాల్ తన ప్రియురాలు ఆశాదేవిని murder చేసి శవాన్ని పొలాల మధ్యలో పాతి పెట్టాడు. ఆశాదేవి కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..  సత్పాల్‌పైకేసు నమోదు చేసి జైలుకు తరలించారు.  పోలీసుల విచారణలో తాను చేసిన నేరాన్ని సత్పాల్ ఒప్పుకున్నాడు. ఆమెను హత్య చేయడానికి వాడిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu