MK Stalin to BJP: "వాళ్ళు నిజ‌మైన దేశ‌భ‌క్తులు కాదు.. రాజకీయ లబ్ధి కోసమే 75వ స్వాతంత్య్ర వేడుకలు" 

Published : Aug 15, 2022, 02:41 AM IST
MK Stalin to BJP: "వాళ్ళు నిజ‌మైన దేశ‌భ‌క్తులు కాదు.. రాజకీయ లబ్ధి కోసమే 75వ స్వాతంత్య్ర వేడుకలు" 

సారాంశం

MK Stalin to BJP: రాజకీయ లబ్ధి కోసం బీజేపీ దేశభక్తి లేబుల్ ను వాడుకుంటున్నదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు

MK Stalin to BJP: భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ విరుచుక‌ప‌డ్డారు. దేశభక్తి ముసుగుతో బీజేపీ రాజకీయ లబ్ధి పొందాల‌ని ప్ర‌య‌త్నిస్తుంద‌ని ఆరోపించారు. "దేశభక్తి లేబుల్" ఉపయోగించి ద్వేషపూరిత చర్యలకు పాల్పడే కఠోర రాజకీయాలను చట్టబద్ధంగా అణిచివేస్తామని అన్నారు.

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లను అధికార‌ బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని స్టాలిన్ మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండాను అవమానించారని ముఖ్యమంత్రి ఆరోపించారు. మధురైలో బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ కారుపై చెప్పులు విసిరారు. ఆ వాహనం బానెట్‌లో జాతీయ జెండా కూడా ఉందన్నారు.

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల గౌరవాన్ని వారు (బీజేపీ కార్యకర్తలు) చెప్పులు విసిరి దెబ్బతీశారని, ఈ ఘటనతో వారిలో ఎంత దేశభక్తి  ఉందో తెలియజేస్తోందని అన్నారు. 

 రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. నివాళులర్పించడానికి బదులుగా, అన్నామలై, అతని పార్టీ కార్యకర్తలు చౌకబారు రాజకీయ ప్రచారానికి గుమిగూడారని, ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బీజేపీ కార్యకర్తలు రావడాన్ని త్యాగరాజన్, అధికారులు ప్రశ్నించగా, అనుచితిగా ప్రవర్తించి తమ ప్రమాణాలను ప్రదర్శించారని స్టాలిన్ అన్నారు. జాతీయ జెండాను అవమానపరిచి, వాహ‌నంపై చెప్పులు విసిరి హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్న వారిని అరెస్టు చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. 

కారుపై దాడితోనే బీజేపీ నాయ‌కులు దేశభక్తులు కాద‌ని తేలిపోయిందని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై పబ్లిసిటీ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటన వెనుక ఉన్న శక్తులు (నిందితులు) అసాంఘిక‌ చర్యలకు పాల్పడితే..  చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. బిజెపిపై తీవ్రంగా దాడి చేశారు. ఇది తమిళనాడు అని, ఇక్కడ మీ రాజకీయ ఆటలు సాగవని స్టాలిన్ అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?