President’s Medal for Gallantry: కీర్తి చక్ర, శౌర్యచక్ర పుర‌స్కారాల‌ను అందుకోబోతున్న జవాన్లు వీరే..  

Published : Aug 15, 2022, 01:43 AM IST
President’s Medal for Gallantry: కీర్తి చక్ర, శౌర్యచక్ర పుర‌స్కారాల‌ను అందుకోబోతున్న జవాన్లు వీరే..  

సారాంశం

President’s Medal for Gallantry: భారత దేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవాల (Independence Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శౌర్య పతకాలను ప్రకటించింది. ఈ ఏడాది 107 శౌర్య పతకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ఆమోదించారు. వీటిలో 3 కీర్తి చక్ర, 13 శౌర్య చక్ర, 81 సేన పతకాలు (శౌర్యం) సేన పతకం (శౌర్యం) - 81 పురస్కారాల‌ను ప్ర‌భుత్వం ప్రకటించింది.  

President’s Medal for Gallantry: భారతదేశ 76వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుక‌ల (Independence Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది 107 శౌర్య పతకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ఆమోదించారు. వీటిలో శౌర్య పురస్కారం, కీర్తి చక్ర, శౌర్య చక్ర ఉన్నాయి. ఈ ఏడాది 3 కీర్తి చక్ర, 13 శౌర్య చక్ర, 81 సేన  (శౌర్యం) పురస్కారాల‌ను ప్ర‌భుత్వం ప్రకటించింది. విశేషమేమిటంటే.. మెన్షన్-ఇన్-డిస్పాచ్‌లో ఆర్మీకి చెందిన కుక్క పేరు కూడా పుర‌స్కారం ల‌భించింది. 

కీర్తి చక్ర అవార్డు అందుకోబోతున్న జవాన్లు వీరే..  

1. ఇండియన్ ఆర్మీ హీరో దేవేంద్ర ప్రతాప్ సింగ్ 

పుల్వామాలో 29 జనవరి 2022న జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన 56 రాష్ట్రీయ రైఫిల్స్ (RR)  నాయక్ దేవేంద్ర ప్రతాప్ సింగ్ పాల్గొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రతాప్ సింగ్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాడు.
  
2. BSF కానిస్టేబుల్ సుదీప్ సర్కార్ 

 8 నవంబర్ 2020న BSF కానిస్టేబుల్ సుదీప్.. నియంత్రణ రేఖలోని కుప్వారా సెక్టార్‌లో సర్కార్ విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎల్‌ఓసి ఫ్యాన్‌లకు దగ్గరగా.. ఆయ‌న త‌న సహచరులతో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ జ‌రిగింది. ఈ ఎన్ కౌంట‌ర్లో ఉగ్రవాదులు హ్యాండ్ గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌తో సుదీప్ సర్కార్ గాయపడినప్పటికీ.. ఒక ఉగ్రవాదిని హతమార్చగా, మిగిలిన ఉగ్రవాదులు పారిపోయారు. అతని అసమానమైన ధైర్యం, పరాక్రమానికి,  మరణానంతరం  అత‌నికి కీర్తి చక్ర ప్రదానం చేయబడింది.

3. BSF సబ్-ఇన్‌స్పెక్టర్ పౌటిన్సాట్ గ్వాట్

1 డిసెంబర్ 2020న అంటే BSF యొక్క రైజింగ్ డే సందర్భంగా, సబ్ ఇన్‌స్పెక్టర్ పోటిన్‌శాట్ గూట్‌తో పాటు అతని దళం రాజౌరీ సెక్టార్‌లోని ఎల్‌ఓసిలో FDL (ఫార్వర్డ్ డిఫెన్స్ లొకేషన్‌)లో విధులు నిర్వ‌హిస్తున్నారు. ఈ ప్రాంతం ఉగ్రవాదుల చొరబాటుకు పేరుగాంచింది. అదే సమయంలో 3-4 మంది పాక్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి ప్ర‌య‌త్నించ‌గా.. ఎన్‌కౌంటర్ కు దిగారు. ఈ సమయంలో గౌటే తీవ్రంగా గాయపడ్డాడు. అయినా.. గ్వాట్ ఒక ఉగ్రవాదిని హతమార్చాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఆయ‌న  అత్యున్నత త్యాగం,  స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని మరణానంతరం ప్ర‌భుత్వం కీర్తి చక్రను ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించింది.

శౌర్యచక్ర గౌరవాన్ని అందుకోబోతున్న జ‌వాన్లు వీరే 

ఈ ఏడాది కేంద్రం 13 శౌర్య చక్ర పురస్కారాల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో ఇండియన్ ఆర్మీ  చెందిన 8 జవాన్లు ఈ అత్యున్న‌త పుర‌స్కారం ల‌భించింది. ఆ జాబితాలో మేజర్ నితిన్ ధనియా, మేజర్ అమిత్ దహియా, మేజర్ సందీప్ కుమార్, మేజర్ అభిషేక్ సింగ్, హవల్దార్ ఘనశ్యామ్, లాన్స్ నాయక్ రాఘవేంద్ర సింగ్‌లు శౌర్యచక్ర గౌరవం ద‌క్కింది. వీరే కాకుండా.. మ‌ర‌ణానంత‌రం సిపాయి కరణ్ వీర్ సింగ్, గన్నర్ జస్బీర్ సింగ్‌లకు శౌర్య చక్ర ప్రదానం చేస్తున్నారు. అలాగే.. నౌకాదళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ మృత్యుంజయ్ కుమార్, CRPF చెందిన అసిస్టెంట్ కమాండెంట్ అమిత్ కుమార్ ఈ పురస్కరం ద‌క్కింది. ఇదే త‌రుణంలో మహారాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన సోమయ్ వినాయక్ ముండే (IPS), అదనపు SP రవీంద్ర కాశీనాథ్ నేతం, పోలీస్ హీరో తికారం ల‌కు పురాస్కారం ద‌క్కంది. 

 ఇది కాకుండా, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రపతి పోలీసు పతకాన్ని (గ్యాలంట్రీ) కూడా ప్రకటించింది. ఈ ఏడాది అత్యధిక శౌర్య పతకాలను CRPF, జమ్మూ మరియు కాశ్మీర్ పోలీసులు  పొందారు. అధికారిక ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. CRPFకి 109 పతకాలు, BSFకి 19, ITBP-SSBకి 6 పతకాలు లభించాయి. ఇక రాష్ట్రాల ప‌రంగా చూస్తే..  మహారాష్ట్ర పోలీసులకు 42 శౌర్య పతకాలు, ఛత్తీస్‌గఢ్‌కు కూడా 15 పతకాలు వచ్చాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?