అయోధ్య వివాదంలో సినీ నటుడు షారూక్ ఖాన్ మధ్య వర్తిత్వం, కానీ....

By telugu news teamFirst Published Apr 24, 2021, 9:27 AM IST
Highlights

షారూక్ మధ్యవర్తిత్వం చేసి.. సమస్య పరిష్కారానికి కృషి చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

రామ జన్మ భూమి అయోధ్య విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా వివాదాలు చోటుచేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అక్కడ రామ మందిరం నిర్మించాలని హిందువులు.. లేదు.. అక్కడ అప్పటికే మసీద్ ఉందని ముస్లింలు ఎన్నో సంవత్సరాలుగా వాదనలకు దిగిన సంగతి కూడా మనకు తెలిసిందే. కాగా.. ఈ వివాదం విషయంలో బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్.. మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. 

షారూక్ మధ్యవర్తిత్వం చేసి.. సమస్య పరిష్కారానికి కృషి చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మ్యాటరేంటంటే... 

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ఏ బాబ్డే పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. అయోధ్య భూ వివాదం టాపిక్ వచ్చింది. 

 సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ”జస్టిస్ బాబ్డే షారూఖ్ ఖాన్ అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వం చేస్తారా అని నన్ను అడిగారు. నేను షారూఖ్ తో మాట్లాడాను. ఆయన సంతోషంగా దీనికి ఒప్పుకున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన మధ్యవర్తిత్వం పని చేయలేదు.” అని చెప్పారు. ఈ సమయంలో అక్కడ జస్టిస్ బాబ్డే ఉన్నారు. వికాస్ సింగ్ చెప్పేది అంతా ఆయన వింటూనే ఉన్నారు.

సుప్రీం కోర్టు తొలుత ముగ్గురు సభ్యులతో కూడిన పేనల్ ను అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వానికి నియమించింది. అందులో జస్టిస్ కలీఫుల్లా, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, అలాగే సీనియర్ లాయర్ శ్రీరాం పంచు లు ఇందులో సభ్యులు. ఈ పానెల్ చాలా సార్లు చర్చలు జరిపింది కానీ, ఫలితం దొరకలేదు. అప్పుడు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ ఈ కేసును సుప్రీం కోర్టు వింటుందని నిర్ణయించారు. 2019 లో సుప్రీం కోర్టు అయోధాయ్ స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా, మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని తీర్పు ఇచ్చింది.
 

click me!