గంటలు గడుస్తున్నా గమ్యం చేరని ఆక్సిజన్ ట్యాంకర్.. మిస్సింగ్ కేసు నమోదు

By Siva Kodati  |  First Published Apr 23, 2021, 7:29 PM IST

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రోగులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర చికిత్స కోసం ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఇది తారా స్థాయికి చేరడంతో రాష్ట్రాల మధ్య వివాదాలు రేగుతున్నాయి


దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రోగులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర చికిత్స కోసం ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఇది తారా స్థాయికి చేరడంతో రాష్ట్రాల మధ్య వివాదాలు రేగుతున్నాయి.

తమ రాష్ట్రానికి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఢిల్లీ ప్రభుత్వం దొంగిలించిందంటూ హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ చేసిన ఆరోపణ సంచలనం కలిగించింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆక్సిజన్ సంక్షోభం ఏ స్థాయిలో వుందో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. 

Latest Videos

undefined

Also Read:ఢిల్లీ మా ఆక్సీజన్ సిలిండర్లు దొంగిలించింది.. మండిపడుతున్న హర్యానా ..

ఈ నేపథ్యంలో హర్యానాలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ను తీసుకెళ్తున్న ట్యాంకర్‌ అదృశ్యం కావడం కలకలం రేపింది. పానిపట్‌ నుంచి సిర్సాకు ఆక్సిజన్‌ లోడుతో వెళ్తున్న ట్యాంకర్‌ అదృశ్యంపై కేసు నమోదు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పానిపట్ జిల్లా డ్రగ్‌ కంట్రోలర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం లిక్విడ్‌ ఆక్సిజన్‌ను పానిపట్‌ ప్లాంట్‌లో నింపిన తర్వాత ట్రక్కు సిర్సాకు బయల్దేరినట్టు అధికారులు తెలిపారు. అయితే, గంటలు గడుస్తున్నా ఆ వాహనం గమ్యస్థానానికి చేరలేదన్నారు. 

click me!