బ్యూటీ పార్లర్‌లోకి చొరబడి పెళ్లికూతురు మేకప్‌ చేసుకుంటున్న మహిళపై కాల్పులు.. కానిస్టేబుల్ ఘాతుకం..

Published : May 23, 2023, 02:35 PM IST
బ్యూటీ పార్లర్‌లోకి చొరబడి పెళ్లికూతురు మేకప్‌ చేసుకుంటున్న మహిళపై కాల్పులు.. కానిస్టేబుల్ ఘాతుకం..

సారాంశం

బ్యూటీ పార్లర్‌లో పెళ్లి మేకప్ వేసుకుంటున్న 26 ఏళ్ల యువతిపై బీహార్ పోలీసు కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆమె ఎడమ భుజం, ఛాతికి తగలడంతో ఆ మహిళ ప్రమాదం నుంచి బయటపడింది.

బీహార్ : బీహార్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ పోలీసు బ్యూటీపార్లర్ లోకి చొరబడి.. పెళ్లికూతురి ముస్తాబవుతున్న యువతి మీద కాల్పులు జరిపాడు. ఇది ప్రేమ తిరస్కారాన్ని తట్టుకోలేకపోవడం వల్ల జరిగిన అకారణ హింసాత్మకంగా మారిన ఘటనగా భావిస్తున్నారు.

బాధితురాలైన 26 ఏళ్ల మహిళ తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన బీహార్ పోలీసు కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమె పెళ్లికి కొద్ది గంటల ముందు బీహార్‌, ముంగేర్‌లోని బ్యూటీ పార్లర్‌లో ఆమె మీద కాల్పులు జరిపాడు. అయితే, మహిళ ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది.

శుభ్ మన్ గిల్ సోదరిని అసభ్యకరంగా ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం - డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్

బాధితురాలిని అపూర్వ కుమారిగా గుర్తించారు. ఆమె తన పెళ్లికి బ్రైడల్ మేకప్ వేసుకోవడానికి బ్యూటీ పార్లర్‌కి వచ్చింది. ఈ విషయం తెలిసిన అమన్‌కుమార్‌ అనే పోలీసు పార్లర్ లోకి చొరబడి ఆమె మీద దాడి చేశాడు. ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రే ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. 

పెళ్లికి ముస్తాబవుతుండడం చూసిన అతను కోపంతో రగిలిపోయాడు. వెంటనే తన దగ్గరున్న తుపాకీ తీసి ఆమెపై కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ఆమె ఎడమ భుజాన్ని, మరో బులెట్ ఆమె ఛాతీ కుడి వైపున తాకింది. మహిళపై కాల్పులు జరిపిన తరువాత, కానిస్టేబుల్ కూడా చనిపోవాలని కణతలకు తుపాకీని పెట్టి కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. అయితే, భయంతో పిస్టల్ అతని చేతిలో నుండి జారిపోవడంతో ఆ ప్రయత్నం విఫలమయ్యింది.

కాల్పులు జరిపిన తరువాత అక్కడి నుండి పారిపోతుండగా, పార్లర్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ అతను తప్పించుకుని, అక్కడినుంచి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన అంతా బ్యూటీపార్లర్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. మహిళను ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. 

"బుల్లెట్ ఆమె శరీరంలోని కీలక భాగాలను తాకలేదు. ఆమె ప్రాణాపాయం నుండి బయటపడింది. ఆమెకు ప్రథమ చికిత్స చేశాం" అని ముంగేర్‌లోని సదర్ ఆసుపత్రి అధికారి పిఎం సహాయ్ తెలిపారు. నిందితుడు పాట్నాలో విధులు నిర్వహిస్తున్న బీహార్ పోలీసు కానిస్టేబుల్ అని ముంగేర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) రాజేష్ కుమార్ తెలిపారు.

"నిందితుడు మహేశ్‌పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి.. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించాం. త్వరలో అరెస్టు చేస్తాం" అని డీఎస్పీ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్