ఫ్లైట్‌లో బాంబ్ ఉన్నదని ఫోన్ కాల్.. విమానంలో తనిఖీలు చేస్తున్న అధికారులు

By Mahesh KFirst Published Jan 12, 2023, 9:24 PM IST
Highlights

ఢిల్లీ నుంచి పూణెకు వెళ్లుతున్న స్పైస్ జెట్ ప్లేన్‌లో బాంబ్ ఉన్నదనే ఓ కాల్ అధికారులు రాగానే వెంటనే ఆ ఫ్లైట్‌ను ఐజీఐలోనే ఆపేశారు. ఆ ఫ్లైట్‌లో సెర్చ్ చేపడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి అనుమానించదగ్గ వస్తువులు కనిపించలేదని అధికారులు తెలిపారు.
 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి పూణెకు వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఫ్లైట్‌లో బాంబ్ ఉన్నదని ఓ కాల్ వచ్చింది. ఆ ఎయిర్ లైన్ అధికారులు విమానాన్ని టేకాఫ్ కాకుండా ఆపేశారు. ఈ విమానం షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్టు నుంచి పూణె వెళ్లడానికి టేకాఫ్ల్ కావాల్సింది.

బాంబ్ ఉన్నదనే కాల్ రాగానే ఎయిర్ లైన్ అధికారులు విమానంలోకి ప్రయాణికులను ఎక్కనివ్వకుండా ఆపేశారు. వెంటనే బాంబ్ స్క్వాడ్‌కు ఫోన్ చేశారు. ప్యాసింజర్లు, క్రూ సిబ్బంది అందరూ సురక్షితంగా న్నారు. ఆ విమానంలో తనిఖీలు చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆ విమానంలో అనుమానించదగినవేవీ కనిపించలేదు. ఎలాంటి పరిస్థితులనైనా హ్యాండిల్ చేయడానికి ప్యారామిలిటరీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్, ఢిల్లీ పోలీసులు సిద్ధంగా ఉన్నారు.

Also Read: వీడి దుంపతెగ.. భార్యతో గొడవపడి పోలీసులపై కసి తీర్చుకున్నాడు.. బాంబు ఉందంటూ కాల్ చేసి.. పరుగులు పెట్టించి..

‘సీఐఎస్ఎఫ్ అధికారులు, ఢిల్లీ పోలీసులు అలర్ట్‌ మోడ్‌లో ఉన్నారు. పూణెకు వెళ్లుతున్న స్పైట్ జెట్ ప్లేన్‌లో బాంబ్ ఉన్నదని వచ్చిన ఓ ఫోన్ కాల్ గురించి తాము పై అధికారులు తెలియజేశాం’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు పీటీఐ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.

ఆ ప్లేన్‌లో చెకింగ్ జరుగుతున్నదని, కానీ, ఇప్పటి వరకు అనుమానించదగినదేమీ కనిపించలేదని ఆయన వివరించారు. అయితే, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం సెక్యూరిటీ డ్రిల్ పాటిస్తున్నామని చెప్పారు.

అంతేకాదు, ఒక వేళ ఆ కాల్ వాస్తవం కాదా? కేవలం బెదిరింపా? అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

click me!