రష్యాలో చిక్కుకున్న భారత సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ సింధురత్న.. అమెరికా ఆంక్షలతో మారిన పరిస్థితులు

Published : Jan 12, 2023, 08:34 PM IST
రష్యాలో చిక్కుకున్న భారత సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ సింధురత్న.. అమెరికా ఆంక్షలతో మారిన పరిస్థితులు

సారాంశం

మన దేశ సబ్ మెరైన్ ఐఎన్ఎస్ సింధురత్న రష్యాలో చిక్కుకుంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, యూరప్ దేశాలు దానిపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు మేజర్ రీఫిట్ కోసం అక్కడికి వెళ్లిన మన సబ్ మెరైన్ ఇప్పుడు వెనక్కి తిరిగి రావడం జటిలంగా మారింది. అందుకే నేవీ ఆ సబ్ మెరైన్‌ను నేరుగా రష్యా నుంచి కాకుండా దాన్ని నార్వే వరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి ముంబయికి సీలిఫ్ట్ చేయాలని ప్లాన్ చేసింది.  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయడం మన భారత సబ్ మెరైన్‌కు చిక్కులు తెచ్చి పెట్టింది. ఈ యుద్ధం కారణంగా, అమెరికా, దాని సారథ్యంలోని ఇతర యూరప్ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించింది. ఆ దేశంతో మరే దేశం కూడా సంబంధాలు నెరుపరాదని, వాణిజ్యం మొదలు నౌక, ఆయుధ సరఫరాలపైనా నిషేధాలు అమల్లోకి వచ్చాయి. దీంతో మేజర్ రీఫిట్ కోసం వెళ్లిన మన దేశ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ సింధురత్న రష్యాలోనే చిక్కుకుపోయింది. ఆ సబ్ మెరైన్ కోసం భారత నౌకా దళం ఆత్రంగా ఎదురుచూస్తున్నది.

మన మిలిటరీ హార్డ్‌వేర్‌లో 60 శాతం వరకు సోవియట్ లేదా రష్యా మూలాలవే ఉన్నాయి. కాబట్టి, ఇందుకు సంబంధించిన ఏ రిపేర్ లేదా ఎక్స్‌టెన్షన్ లేదా నవీకరణ, ఇతర ఏ అంశాలైనా రష్యాతో ముడిపడే ఉంటున్నాయి. కానీ, ఇప్పుడు ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం జరుగుతున్న తరుణంలో మన దేశానికి పరోక్షంగా కొంత ఇబ్బంది వచ్చింది. డాలర్ రూపంలో కాకుండా ప్రత్యామ్నాయ పేమెంట్ మెకానిజంలో రష్యాకు చెల్లించాల్సి రావడం ఇప్పుడు సవాలుగా మారింది. మన మిలిటరీ ఆయుధాల నవీకరణ, లేదా కొత్త ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించి మన దేశం రష్యాకు వేరే రూపంలో చెల్లించాల్సి రావడం కష్టంగా మారింది. అయితే, అది పెద్ద సవాలేమీ కాదని, ‘మనం మేనేజ్ చేయగలుగుతున్నాం’ అని కొన్ని కీలక వర్గాలు తెలిపాయి.

మన దేశ నౌకా దళంలో ఐఎన్ఎస్ సింధురత్న కీలకమైన సబ్ మెరైన్. ఇది మరింత కాలం లేదా దీర్ఘకాలం పని చేయడం కోసం రీఫిట్ చేయాలని రష్యాకు పంపారు. డీజిల్ - ఎలక్ట్రిక్ సబ్ మెరైన్  అయిన ఐఎన్ఎస్ సింధురత్న రీఫిట్ తర్వాత మళ్లీ వెనక్కి తీసుకురావడానికి కూడా ప్లాన్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో ఈ సబ్ మెరైన్‌ను రష్యాలోని సెవెరోడ్‌విన్స్‌క్ షిప్‌యార్డ్ నుంచి నేరుగా ముంబయికి కమర్షియల్ ట్రాన్స్‌పోర్ట్ డాక్ షిప్ ద్వారా ముంబయి తీరానికి తీసుకురావాలని భారత నౌకా దళం అనుకుంది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

Also Read: ప్రధాని మోడీ పర్యటనకు ముందు.. కీలక సబ్‌మెరైన ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఫ్రాన్స్.. కారణం ఇదేనంటా..!

దీంతో నేవీ ఫోర్స్ ఇప్పుడు దాని ప్లాన్ మార్చుకుంది. ఈ కిలో క్లాస్ సబ్ మెరైన్‌ను రష్యా నుంచి నేరుగా ముంబయికి కాకుండా.. దాన్ని నార్వే వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి ముంబయికి తీసుకురావాలని అనుకుంటున్నది. మన ఐఎన్ఎస్ సింధురత్నను ట్రోమ్సో లేదా నార్వేలోని ఏ ఇతర పోర్టులో నుంచి అయినా కేప్ ఆఫ్ గుడ్ హోప్ సముద్ర దారిలో ముంబయికి చేర్చడం కోసం కొత్తగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌ను పెట్టింది. ఈ విషయంపై ఓ అధికారి మాట్లాడారు.

‘వాస్తవానికి మన సబ్ మెరైన్‌ను నేరుగా రష్యా నుంచి వెనక్కి తెచ్చుకోవాలి. కానీ, రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతోపాటు ట్రాన్స్‌పోర్టేషన్‌తోపాటు కొన్ని ఇతర సమస్యలు ఉన్నాయి. అందుకే ఐఎన్ఎస్ సింధురత్నను నార్వే వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి సీ లిఫ్ట్ చేసి ముంబయికి తీసుకురావాలని ఇప్పుడు ప్లాన్ చేశారు’ అని వివరించారు.

2014 ఫిబ్రవరిలో ఐఎన్ఎస్ సింధురత్నలో ఓ ప్రమాదం జరిగింది. అందులో ఇద్దరు ఆఫీసర్లు మరణించారు. ఆ తర్వాతే మీడియం రీఫిట్ కమ్ లైఫ్ ఎక్స్‌టెన్షన్ అప్‌గ్రెడేషన్ కోసం ఈ సబ్ మెరైన్‌ను సెవెరోడ్విన్స్‌క్‌కు పంపించారు.

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు