పంజాబ్ కాంగ్రెస్‌లో ‘‘ పీసీసీ ’’ చిచ్చు: సిద్ధూకి పదవిపై అమరీందర్ సింగ్ అలక, రంగంలోకి హరీశ్ రావత్

By Siva KodatiFirst Published Jul 17, 2021, 3:35 PM IST
Highlights

సిద్ధూకి పీసీసీ పదవి కన్ఫర్మ్ అంటూ వాస్తున్న వార్తలతో పంజాబ్ రాజకీయం మళ్లీ వేడెక్కింది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ హరీశ్ రావత్ శనివారం సీఎంతో భేటీ అయ్యారు.

నవజోత్ సింగ్ సిద్ధూకు పంజాబ్ పీసీసీ పదవిని కట్టబెట్టనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తితో వున్నారు. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రికి ఓ లేఖను కూడా రాశారు. పంజాబ్ విషయంలో అధిష్టానం మితిమీరిన జోక్యం చేసుకుంటోందని సీనియర్లను విస్మరించారని లేఖలో దుయ్యబట్టారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి కష్టమేనని సీఎం తెగేసి చెప్పారు.

ఈ నేపథ్యంలో కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ హరీశ్ రావత్ శనివారం సీఎంతో భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ భేటీ సాగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత హరీశ్ రావత్ మాట్లాడుతూ.. పంజాబ్ విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సీఎం అమరీందర్ కట్టుబడే వుంటారని పేర్కొన్నారు. సోనియా నిర్ణయానికి తాను కట్టుబడే వుంటానని సీఎం తనతో అన్నారని హరీశ్ రావత్ వెల్లడించారు.

Also Read:అమరీందర్ సింగ్‌కు చెక్.. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నవజోత్ సింగ్ సిద్దూ..?

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అమరీందర్ మాట్లాడుతూ.. హరీశ్ రావత్‌తో భేటీ ఫలప్రదమైందన్నారు. సోనియా ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడే వుంటాం.. కొన్ని సమస్యలు వున్న మాట వాస్తవమేనని వాటిని అధ్యక్షురాలు సోనియాతో చర్చించుకుంటామని సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఫైర్ బ్రాండ్ సిద్ధూ కూడా ఇతర నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సునీల్ జాకేడేతో భేటీ అయ్యారు. 

click me!