సెప్టెంబర్‌లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. పూర్తి వివరాలు ఇవే..

Published : Aug 31, 2023, 02:58 PM ISTUpdated : Aug 31, 2023, 03:09 PM IST
సెప్టెంబర్‌లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. పూర్తి వివరాలు ఇవే..

సారాంశం

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించేందుకు మోదీ సర్కార్ సిద్దమైంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు. 

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించేందుకు మోదీ సర్కార్ సిద్దమైంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్టుగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఐదు రోజులు ఈ సమావేశాలను నిర్వహించనున్నట్టుగా చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజులు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు (17వ లోక్‌సభ 13వ సమావేశాలు, రాజ్యసభ 261వ సమావేశాలు) నిర్వహించబడనున్నాయి’’ అని ప్రహ్లాద్ జోషి తెలిపారు. అమృత్‌ కాల్‌ నేపథ్యంలో పార్లమెంటులో ఫలవంతమైన చర్చలు, డిబేట్లు జరగాలని ఎదురుచూస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు.

 

అయితే మోదీ సర్కార్.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనంలో ఈ సమావేశాలను నిర్వహిస్తారా? లేదా కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో ఈ సమావేశాలు జరుగుతాయా? అనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఇక, కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ముగియగా.. వాటిని పాత భవనంలోనే నిర్వహించారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌