బెంగాల్ మాజీ మంత్రికి మరోసారి ఎదురుదెబ్బ.. బెయిల్ పిటిషన్ రద్దు..  14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

By Rajesh KarampooriFirst Published Dec 22, 2022, 10:44 PM IST
Highlights

టీచర్ల రిక్రూట్ మెంట్ స్కాంలో సూత్రధారి అయిన పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి పార్థాచటర్జీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) చేసిన విజ్ఞప్తిపై అతనికి మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

టీచర్ల రిక్రూట్ మెంట్ స్కాంలో సూత్రధారి అయిన పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి పార్థాచటర్జీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతాలోని సిబిఐ ప్రత్యేక కోర్టు గురువారం పార్థ ఛటర్జీ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అదే సమయంలో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. టీచర్ల రిక్రూట్ మెంట్ స్కాం సంబంధించి మంత్రి పార్థాచటర్జీని జ్యుడీషియల్ కస్టడీ ముగిసిన రోజున అలీపూర్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ 25వ వ్యవస్థాపక దినోత్సవం (జనవరి 1)కి ముందు పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అదే సమయంలో తన నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు పార్థాచటర్జీ.  

ఛటర్జీ బెయిల్ దరఖాస్తును తిరస్కరించిన కోర్టు, సీబీఐ దరఖాస్తుపై 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఎస్‌సి రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై సిబిఐ విచారణ జరుపుతోంది. అదే సమయంలో, పార్థ ఛటర్జీ తరపు న్యాయవాదులు ఈ కేసులో కొత్త పరిణామాలు ఏమీ లేవని, అతన్ని కస్టడీలో ఉంచడం వల్ల దర్యాప్తు ప్రయోజనం లేదని అన్నారు. సిబిఐ తరపు న్యాయవాదులు బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించారు. అతని జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలని కోరారు. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలో ఉందని మరియు ఈ దశలో అతన్ని బెయిల్‌పై విడుదల చేయడం దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తుందని పేర్కొంది.

టీచర్ల రిక్రూట్ మెంట్ స్కాంలో సూత్రధారి అయిన పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి పార్థాచటర్జీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జూలై 23న అరెస్టు చేసింది. దీని తరువాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శితో సహా అన్ని పదవుల నుండి ఛటర్జీని తొలగించింది. దీంతో పాటు సీఎం మమతా బెనర్జీ ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. 2014 నుంచి 2021 వరకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల్లో స్కామ్‌ జరిగిన సమయంలో మాజీ మంత్రి పార్థ్‌ విద్యాశాఖను నిర్వహించారు. ఈ వ్యవహారంలో అవినీతిపై సీబీఐ కూడా విచారణ జరుపుతోంది. విచారణకు సంబంధించి వారి నుంచి ఛటర్జీని కూడా అరెస్టు చేశారు.

మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి ఎవరూ ఎలాంటి నష్టం కలిగించలేరని గతంలో పార్థ ఛటర్జీ పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 23న మాజీ మంత్రి పార్థాచటర్జీ సన్నిహిత అనుచరురాలు అయిన అర్పితా ముఖర్జీ కూడా అదుపులో తీసుకున్నారు. వ్యాపార సంబంధాలున్నాయని ఈడీ విచారణలో వెల్లడైంది. అర్పితాముఖర్జీ ఫ్లాట్లలో 52కోట్ల రూపాయల నగదుతోపాటు పెద్దఎత్తున బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై సీబీఐ విచారణ జరుపుతోంది. అలాగే, ఈ కేసుకు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది.

click me!