కేంద్ర మంత్రి జై శంకర్‌తో మాట్లాడిన సౌత్ కొరియా విదేశాంగ మంత్రి.. హ్యుందాయ్‌ అనుచిత పోస్టుపై విచారం

Published : Feb 08, 2022, 03:30 PM IST
కేంద్ర మంత్రి జై శంకర్‌తో మాట్లాడిన సౌత్ కొరియా విదేశాంగ మంత్రి.. హ్యుందాయ్‌ అనుచిత పోస్టుపై విచారం

సారాంశం

దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఇయు-యోంగ్‌తో భారత విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌ జై శంకర్‌ (S Jaishankar)‌ పలు అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా హ్యుందాయ్ పాకిస్తాన్ (Hyundai Pakistan) చేసిన సోషల్ మీడియా పోస్ట్‌‌పై చుంగ్ ఇయు-యోంగ్ విచారం వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లండించిది.

దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఇయు-యోంగ్‌తో భారత విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌ జై శంకర్‌‌ (S Jaishankar) పలు అంశాలు చర్చించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ జై శంకర్ ట్విట్టర్వ వేదికగా వెల్లడించారు. ఈరోజు ఉదయం చుంగ్ ఇయు-యోంగ్‌ నుంచి కాల్ వచ్చినట్టుగా తెలిపారు. ఇరువురి మధ్య  ద్వైపాక్షిక, బహుపాక్షిక సమస్యలు చర్చకు వచ్చినట్టుగా తెలిపారు. హ్యుందాయ్ విషయంపై కూడా చర్చించినట్టుగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. హ్యుందాయ్ పాకిస్తాన్ సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి మీడియా ప్రశ్నలకు కూడా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ప్రకటన విడుదల చేశారు. 

‘కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా హ్యుందాయ్ పాకిస్తాన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌ను మేము చూశాము. ఈ సోషల్ మీడియా పోస్ట్ చేసిన వెంటనే ఫిబ్రవరి 6వ తేదీన సియోల్‌లోని మా రాయబారి హ్యుందాయ్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించి వివరణ కోరారు. తర్వాత ఆ పోస్టు తొలగించబడింది. రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారితో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిన్న(ఫిబ్రవరి 7)  మాట్లాడింది. హ్యుందాయ్ పాకిస్తాన్ చేసిన ఆమోదయోగ్యం కాని సోషల్ మీడియా పోస్ట్‌పై భారత ప్రభుత్వం తరఫున తీవ్ర అసంతృప్తిని ఆయనకు తెలియజేసింది. 

ఇది భారతదేశం యొక్క ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన అంశం.. ఇందులో ఎటువంటి రాజీ ఉండదని వారి స్పష్టంగా తెలియజేశాం. ఈ సమస్యలను సరైన విధంగా పరిష్కరించడానికి కంపెనీ తగిన చర్యలు తీసుకుంటుందని మేము ఆశించాము. రిపబ్లిక్ ఆఫ్ కొరియా విదేశాంగ మంత్రి Chung Eui-yong ఈ ఉదయం విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ఆ సందర్భంగా వారు అనేక సమస్యలు చర్చించారు. చుంగ్ ఇయు-యోంగ్‌ కూడా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా.. ప్రజలను, భారత ప్రభుత్వాన్ని బాధకు గురిచేసినందుకు చింతిస్తున్నట్లు తెలియజేశారు 

మరోవైపు హ్యుందాయ్ మోటార్స్ భారతదేశ ప్రజలకు తన ప్రగాఢ విచారాన్ని తెలియజేస్తూ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. రాజకీయ లేదా మతపరమైన సమస్యలపై వారి సంస్థ వ్యాఖ్యానించదని స్పష్టం చేసింది.

వివిధ రంగాల్లో విదేశీ కంపెనీల పెట్టుబడులను భారతదేశం స్వాగతిస్తోంది. కానీ.. అటువంటి కంపెనీలు లేదా వాటి అనుబంధ సంస్థలు సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత విషయాలపై తప్పుడు, తప్పుదారి పట్టించే వ్యాఖ్యలకు దూరంగా ఉంటాయని కూడా భావిస్తుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు. 


 

ఇక, ఫిబ్రవరి 5వ తేదీన పాకిస్తాన్‌లో కశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కశ్మీరీ సంస్మరణ దినాన్ని జరుపుకుంటారు. అయితే అదే రోజు.. హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విట్టర్ హ్యాండిల్ (@HyundaiPakistanOfficial) ఓ పోస్టు కనిపించింది. ‘మన కాశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తుచేసుకుందాం.  వారు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నప్పుడు మద్దతుగా నిలబడదాం. #HyundaiPakistan #KashmiriSolidarityDay’ అని పోస్ట్ చేసింది. ఆపై పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తంకాగా.. ఆ పోస్టులు తొలగించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  

PREV
click me!

Recommended Stories

India Gate Ahead of Republic Day 2026: త్రివర్ణ దీపాల కాంతులతో ఇండియా గేట్ | Asianet Telugu
Fresh Snowfall in Sonamarg: మోదీ ప్రారంభించిన సోనమార్గ్ఇప్పుడు ఎలా ఉందో చూడండి| Asianet News Telugu