2023: ఏడాదంతా అదే పనా సామీ? 9,940 కండోమ్‌లు ఆర్డర్ చేసిన ఢిల్లీ వాసి: బ్లింక్ఇట్ సంచలన రిపోర్ట్

By Mahesh K  |  First Published Dec 31, 2023, 6:10 PM IST

దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 2023 ఏడాది కాలంలో 9,940 కండోమ్‌లను ఆర్డర్ చేసినట్టు బ్లింక్ ఇట్ వెల్లడించింది. మరో వ్యక్తి నెల రోజుల్లోనే 38 అండర్‌వేర్‌లు కొన్నట్టు తెలిపింది.
 


Yearender 2023: బ్లింక్ ఇట్ వ్యవస్థాపకుడు అల్బిందర్ దిండ్సా సంచలన విషయాలను వెల్లడించారు. ఏడాదిలో వినియోగదారుల ప్రవర్తన ఎలా ఉన్నది? వారి అలవాట్లు ఎటు వైపుగా మారుతున్నాయి? అనే అంశాలను విశ్లేషిస్తూ మార్కెట్‌ను ఆకర్షించిన కొన్ని అంశాలను తెలిపారు. ఇందులో ఆసక్తికరమైన విషయాలు బోలెడు ఉన్నాయి. దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి బ్లింక్ ఇట్ ద్వారా 2023 ఏడాది కాలంలో 9,940 కండోమ్‌లను ఆర్డర్ చేసినట్టు దిండ్సా తెలిపారు. అలాగే.. పార్టీ స్మార్ట్ ట్యాబ్లెట్లు కూడా పెద్ద మొత్తంలో ఆర్డర్ చేసినట్టు చెప్పారు. 

దక్షిణ ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి ఒక్క నెలలోనే ఏకంగా 38 అండర్‌వేర్‌లను కొనుగోలు చేసినట్టు తెలిపారు. లిక్కర్ పార్టీ తర్వాత హ్యాంగోవర్ రాకుండా ఈ ట్యాబ్లెట్లను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నట్టు వివరించారు. ఏడాది కాలంలో 30,02,080 పార్టీ స్మార్ట్ ట్యాబ్లెట్లు కొనుగోలు చేశారని దిండ్సా తెలిపారు.

Latest Videos

Also Read: Komatireddy Venkatreddy: నిన్న భట్టి.. నేడు రేవంత్ రెడ్డి! సలార్‌ పాటతో కోమటిరెడ్డి వరుస ట్వీట్లు

పర్సనల్ కేర్ ప్రొడక్ట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొంటూ 21,167 బోరోలిన్ యూనిట్లను కొనుగోలు చేసినట్టు దిండ్సా వివరించారు. 80,267 గంగాజల్ బాటిళ్లను కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. ఇది మారుతున్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక తీరును వెల్లడిస్తున్నదని తెలిపారు. గురుగ్రామ్ నగరంలో 65,973 లైటర్లు కొనుగోలు చేశారని, ఇక్కడ ఈ ఏడాది సాంప్రదాయ ట్రెడిషనల్ సాఫ్ట్ డ్రింక్స్ బదులు టానిక్ వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నట్టు వివరించారు.

click me!