ఆ కొవిడ్ రిపోర్ట్ భిన్నంగా ఉన్నది.. ‘డెల్టా’ కాదు.. సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి రిపోర్టుపై కర్ణాటక మంత్రి

By telugu teamFirst Published Nov 29, 2021, 9:13 PM IST
Highlights

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ తేలడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. వారిని వెంటనే క్వారంటైన్‌కు పంపి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. అయితే, ఆ ఫలితాలపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ మాట్లాడుతూ ఆయన కొవిడ్ రిపోర్ట్ భిన్నంగా ఉన్నదని అన్నారు. అది డెల్టా వేరియంట్‌కు భిన్నంగా ఉన్నదని, ఈ విషయంపై తాను కేంద్ర ప్రభుత్వ, ఐసీఎంఆర్ అధికారులతో చర్చిస్తున్నారని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

బెంగళూరు: South Africa నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో కరోనా పాజిటివ్‌(Corona Positive)గా తేలడం Karnatakaలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. వారిద్దరిని వెంటనే క్వారంటైన్‌లోకి పంపారు. అయితే, వారికి సోకింది నూతన వేరియంట్ ఒమిక్రానే(Omicron)నా? కాదా? అనే విషయం కోసం చాలా మంది ఆత్రుతగా, భయంతోనూ ఎదురుచూస్తున్నారు. అయితే, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి ఈ ఫలితాలపై స్పందించారు. కానీ, అసలు విషయాన్ని దాచే ఉంచారు. వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తే అది డెల్టా వేరియంట్‌కు భిన్నంగా కనిపిస్తున్నదని వివరించారు. అంతేకానీ, అది ఒమిక్రాన్ వేరియంటేనా? కాదా? అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు.

దక్షిణాఫ్రికాలో కలకలం రేపుతున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రపంచ వ్యాప్తంగా భయాలు నెలకొన్నాయి. చాలా దేశాలు అంతర్జాతీయ సేవలపై ఆంక్షలు విధించాయి. మళ్లీ కరోనా ఆంక్షలు అమలు చేయడానికి సిద్ధపడ్డాయి. ఇప్పటికే 14 దేశాలకు మించి ఈ వేరియంట్ ఒమిక్రాన్ వ్యాపించడం ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ భయాలు ఇలా ఉండగా, దక్షిణాఫ్రికా నుంచి కర్ణాటక రాజధాని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ తేలింది అనే వార్త కలకలం రేపింది. వెంటనే వారిని క్వారంటైన్‌లోకి పంపి, వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు.

Also Read: Omicron: వేగంగా దేశాలు దాటుతున్న వేరియంట్.. ఆపడం సాధ్యమేనా? ఏయే దేశాలకు చేరిందంటే?

తాజాగా, ఆ ఫలితాలపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ మాట్లాడారు. గత తొమ్మిది నెలలుగా ఇక్కడ డెల్టా వేరియంట్ ఉన్నదని, కానీ, మీరేమో ఇప్పుడు ఒక శాంపిల్లో ఒమిక్రాన్ ఉన్నదని అంటున్నారని తెలిపారు. దీనిపై తాను అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య కూడా చేయలేనని అన్నారు. తాను కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఐసీఎంఆర్ సిబ్బందితో టచ్‌లో ఉన్నారని వివరించారు. ఆ ఇద్దరు వ్యక్తుల శాంపిళ్లు ఐసీఎంఆర్‌కే పంపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి వివరాలు బయటకు చెప్పకుండా ఆ వ్యక్తి కొవిడ్ రిపోర్ట్‌లో ఆయన కరోనా వైరస్‌కు చెందిన భిన్నమైన వేరియంట్ బారిన పడ్డట్టు తెలుస్తున్నదని చెప్పారు. ఆయనకు 63 ఏళ్ల వయసు అని, ఆయన కొవిడ్ రిపోర్ట్ కొంత భిన్నంగా ఉన్నదని తెలిపారు. అది డెల్టా వేరియంట్ కాదనీ అన్నారు. తాను ఐసీఎంఆర్ అధికారులతో చర్చించి వివరాలు వెల్లడిస్తానని అన్నారు.

ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెబుతూ మంగళవారం అంతా భేటీల మీద భేటీలు జరగనున్నట్టు మంత్రి వివరించారు. ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు మొదలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల వరకు వారందరితో తాను రేపు సమావేశం కాబోతున్నట్టు వివరించారు. అంతేకాదు, టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ ఆన్ కొవిడ్-19 నుంచి సభ్యులను ఆహ్వానించామని తెలిపారు. అంతేకాదు, ఒమిక్రాన్‌పై సమగ్ర నివేదికను తాము కోరినట్టు వివరించారు.

Also Read: Omicron: ఒమిక్రాన్ వేరియంట్ గురించి ఆ డాక్టర్ చెప్పే మాటలు నిజమైతే ప్రపంచానికి గుడ్‌ న్యూసే..

వచ్చే నెల 1వ తేదీ కల్లా ఒమిక్రాన్ తీరుపై స్పష్టమైన వివరాలు లభిస్తాయని అన్నారు. అందుకు తగినట్టుగానే తాము చర్యలు తీసుకుంటామని వివరించారు. గత 14 రోజుల నుంచి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారందరి వివరాలను పరిశీలిస్తున్నామని, వారి కాంటాక్టులను ట్రేస్, టెస్టులు చేసే పని ప్రారంభించినట్టు చెప్పారు.

click me!