బెంగాల్ నటుడు సౌమిత్రా ఛటర్జీ మృతి: మోడీ సంతాపం

Published : Nov 15, 2020, 03:22 PM ISTUpdated : Nov 15, 2020, 03:24 PM IST
బెంగాల్ నటుడు సౌమిత్రా ఛటర్జీ మృతి: మోడీ సంతాపం

సారాంశం

బెంగాల్ నటుడు సౌమిత్రా ఛటర్జీ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.


న్యూఢిల్లీ:  బెంగాల్ నటుడు సౌమిత్రా ఛటర్జీ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.

అనారోగ్యంతో బెంగాల్ నటుడు సౌమిత్రా ఛటర్జీ ఆదివారం నాడు మరణించిన విషయం తెలిసిందే.  సౌమిత్రా ఛటర్జీ మరణం ప్రపంచానికి పశ్చిమబెంగాల్, భారత దేశ సాంస్కృతిక రంగానికి తీరని నష్టంగా ఆయన పేర్కొన్నారు.

also read:బెంగాలీ లెజెండరీ నటుడు సౌమిత్ర ఛటర్జీ కన్నుమూత

 

తన రచనల గురించి ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఛటర్జీ మరణంతో తనను తీవ్ర విచారంలో ముంచెత్తిందని ఆయన చెప్పారు. 
ఛటర్జీ కుటుంబానికి ఆయన సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు.


85 ఏళ్ల ఛటర్జీ కోల్ కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.  కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయన కోల్ కతాలోని ఆసుపత్రిలో చేరాడు. కరోనా నుండి కోలుకొన్న తర్వాత కూడ ఆయన అనారోగ్యం నుండి కోలుకోలేదని వైద్యులు చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?