కాల్పుల విరమణకు తూట్లు: పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు

By narsimha lodeFirst Published Nov 15, 2020, 2:41 PM IST
Highlights

జమ్మూకాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్టు పొడుస్తుండడంపై  భారత్ సీరియస్ అయింది.


న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్టు పొడుస్తుండడంపై  భారత్ సీరియస్ అయింది.

పాక్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఘటనకు నిరసనగా భారత్ సమన్లు పంపింది.సాధారణ పౌరులను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకోవడాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. 

జమ్మూకాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ శుక్రవారంనాడు కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు అమరులయ్యారు. మరో నలుగురు పౌరులు మరణించారు.

also read:హద్దు మీరిన దాయాది: ధీటుగా జవాబిస్తోన్న భారత్.. ఏడుగురు పాక్ సైనికులు హతం

ఎల్ఐసీ వెంట ఉన్న పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను భారత బలగాలు పేల్చేశాయి. ఇజ్రాయిల్ నుండి కొనుగోలు చేసిన స్పైక్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ పాక్ స్థావరాలపై ఇండియా ప్రయోగించింది.

పాకిస్తాన్ దళాల కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడడంతో పాకిస్తాన్ హై కమిషన్ యాక్టింగ్ హెడ్ అఫ్తాబ్ హసన్ ఖాన్ ను విదేశాంగ మంత్రిత్వశాఖ పిలిచింది. తన నియంత్రణలో ఉన్న ఏ భూభాగాన్ని భారత్ పై ఉగ్రవాదానికి ఏ విధంగానూ ఉపయోగించకూడదని పాకిస్తాన్ ద్వైపాక్షిక నిబద్దతను భారత విదేశాంగ శాఖ గుర్తు చేసింది.
 

click me!