వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే జైలే: కొడుకు కోడలే కాదు... కూతురు అల్లుడికీ వర్తింపు

By Siva KodatiFirst Published Dec 5, 2019, 9:13 PM IST
Highlights

భారంగా మారారని వయో వృద్ధులను కొడుకు, కొడలు ఏ అనాథాశ్రమంలో చేర్చడమో లేదంటే ఇంట్లోంచి గెంటి వేయడమో చేస్తుంటారు. అయితే ఇకపై కొడుకు, కోడలే కాదు.. అల్లుడు, కోడలిపైనా కేసు నమోదు చేయనున్నారు

భారంగా మారారని వయో వృద్ధులను కొడుకు, కొడలు ఏ అనాథాశ్రమంలో చేర్చడమో లేదంటే ఇంట్లోంచి గెంటి వేయడమో చేస్తుంటారు. అయితే ఇకపై కొడుకు, కోడలే కాదు.. అల్లుడు, కోడలిపైనా కేసు నమోదు చేయనున్నారు.

ఈ మేరకు తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం (సవరణ) బిల్లు-2019కి కేంద్రప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. బుధవారం కేబినెట్ ఆమోదం పొందిన ఆ బిల్లును త్వరలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

Also read:యడ్డీ సీఎంగా ఉంటారా.. ప్రతిపక్షనేతగా మారతారా: డిసెంబర్‌ 9పై అందరి దృష్టి

వయో వృద్ధుల పోషణ నిమిత్తం కుటుంబసభ్యులు చెల్లించాల్సిన మొత్తం గతంలో గరిష్టంగా రూ.10 వేలు ఉండగా.. ఆ పరిమితిని ఎత్తివేశారు. అంతేకాకుండా బాగా సంపాదించేవారు వారి తల్లిదండ్రుల పోషణకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని ముసాయిదాలో పేర్కొన్నారు.

నిబంధనలను ఉల్లంఘిస్తే కనిష్టంగా రూ.5 వేలు లేదా మూడు నెలల జైలు శిక్ష లేదంటే రెండు విధించవచ్చు. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, తమకు నెలవారీ ఖర్చులు చెల్లించడం లేదని 80 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు చేసే ఫిర్యాదులను లెక్కలోకి తీసుకోనున్నారు.

దీనితో పాటు వృద్ధాశ్రమాలు, హోం కేర్ సర్వీస్ ఏజెన్సీలు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునేలా నిబంధనలు రూపొందించారు. ఈ చట్టం అమలు కోసం పోలీస్ స్టేషన్‌లలో నోడల్ అధికారిని నియమించడంతో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక పోలీస్ యూనిట్‌ను నెలకొల్పాలని బిల్లులో పొందుపరిచారు.

Also read:కదులుతున్న కారులో విద్యార్ధినిపై నలుగురు గ్యాంగ్‌రేప్: కారుకు పోలీస్ లోగో

అలాగే వయోవృద్ధుల కోసం ప్రతి రాష్ట్రంలో ఓ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. బిల్లులో ‘‘పోషణ’’ అనే పదానికి విస్తృత నిర్వచనం ఇచ్చారు. ఆహారం, వస్త్రాలు, నివాసం, ఆరోగ్యంతో పాటు వారి భద్రత, సంక్షేమం అనే పదాలను అదనంగా చేర్చారు. వయోవృద్ధుల పోషణను వారసులే కాకుండా అల్లుడు, కోడలు నిర్లక్ష్యం చేస్తున్నారని వయోవృద్ధులు భావిస్తే ఫిర్యాదు చేయవచ్చు. 

click me!