తండ్రి ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ.. రూ.39 లక్షలు ఖాళీ చేసిన కొడుకు...

Published : Jun 24, 2022, 10:47 AM IST
తండ్రి ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ.. రూ.39 లక్షలు ఖాళీ చేసిన కొడుకు...

సారాంశం

ఆన్ లైన్ గేమ్స్ తో ఎన్ని ఇబ్బందులు వస్తాయో తరచుగా వింటూనే ఉన్నాం. తాజాగా అలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఓ కొడుకు ఏకంగా రూ.39 లక్షలు ఖాళీ చేశాడు. 

ఉత్తర ప్రదేశ్ : ఓ పిల్లాడు తన తండ్రి మొబైల్ లో ఆన్లైన్ గేమ్ ఆడి ఏకంగా రూ. 39 లక్షలు పోగొట్టాడు. ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగింది ఈ ఘటన.  తాజ్ నాగ్రికి చెందిన ఓ రిటైర్డ్ సైనికుడి కుమారుడు…తన తండ్రి మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. ఈ క్రమంలోనే ఆ పిల్లవాడు తన తండ్రి మొబైల్లో బ్యాటిల్ గ్రౌండ్ అనే ఆన్లైన్ పెయిడ్ గేమ్ ను ఇన్స్టాల్ చేశాడు. ఆ తర్వాత డబ్బులు చెల్లించే ఆప్షన్ను ఆటో మోడ్ లో పెట్టాడు.   పిల్లాడు చాలాసార్లు గేమ్స్ ఆడాడు. ఆడిన ప్రతిసారి ఆటో మోడల్ డబ్బులు చెల్లింపు అయ్యేవి. అయితే, కొన్ని రోజులకు పిల్లాడి తండ్రి తన బ్యాంకు ఖాతాలో డబ్బులు చెక్ చేయడానికి వెళ్లగా రూ. 39 లక్షలు మాయమైనట్లు గమనించారు. దీనిపై సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు…బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి  సింగపూర్ లోని క్రాఫ్టన్ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ  ఖాతాకు డబ్బులు  బదిలీ అయినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు క్రాఫ్టన్ కంపెనీపై మోసం, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

కాగా, ఇలాంటి ఘటనే న్యూజెర్సీలో ఈ జనవరిలో జరిగింది. వీడియో గేమ్స్ ఆడుకునేందుకు తల్లి స్మార్ట్ ఫోన్ తీసుకున్న.. రెండేళ్ల బాలుడు పొరపాటున 1700 డాలర్లు (సుమారు లక్షా 27 వేల రూపాయలు) విలువైన ఫర్నిచర్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాడు. ఈ ఘటన న్యూజెర్సీలో జరిగింది. ప్రమోద్ కుమార్ - మధులు అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు. ఇటీవలే సొంతింటి కల సాకారం చేసుకున్నారు. కొత్త ఇంటి కోసం ఫర్నిచర్ కొనాలని మధు అనుకున్నారు. వాల్మార్ట్ యాప్ లో ఏ వస్తువులు బాగున్నాయో చూస్తూ కొన్నింటిని కార్ట్ లో యాడ్ చేశారు. 

ఆన్ లైన్ ఆటలో రూ.36 లక్షలు పోగొట్టి బాలుడు.. గేమ్ ఆడుతూ.. డబ్బులు పెడుతూ..ఊడ్చేశాడు..

నెమ్మదిగా ఆర్డర్ చేద్దామని నిర్ణయించుకున్నారు.  అయితే అనూహ్యంగా వాల్ మార్ట్ నుంచి పార్సిల్స్ రావడం మొదలయ్యాయి. ఏంటా అని యాప్ చూసిన ప్రమోద్ కుమార్ - మధులకు అసలు విషయం బోధపడింది. ఇదంతా తమ కుమారుడైన అయాన్ష్ చేసిన పనే అని అర్థమైంది. ‘అయాన్ష్ యాప్ ఓపెన్ చేశాడు. కార్ట్ లో యాడ్ చేసి ఉన్న వాటన్నింటిని ఆర్డర్ చేశాడు. పేమెంట్స్ అన్ని పూర్తయిపోయాయి’ అని ప్రమోద్ తెలిపాడు.  అయాన్ష్ వల్ల పొరపాటు జరిగిందని ఆ దంపతులు వాల్మార్ట్ ను ఆశ్రయించారు. వారి అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించిన ఆ సంస్థ అవసరం లేని వస్తువులు రిటర్న్ చేస్తే.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది.
 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !