ప్లేట్లు కడిగిన సోనియా,రాహుల్: డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటున్న కాంగ్రెస్

By Nagaraju TFirst Published Oct 2, 2018, 4:53 PM IST
Highlights

యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు భోజనం చేసిన తర్వాత తమ ప్లేట్లను తామే కడిగారు. మహాత్మాగాంధీ 150జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఉన్న మహాత్మా గాంధీ సేవాగ్రాం ఆశ్రమం (బాపు కుటీర్‌)లో మంగళవారం పార్టీ వర్కింగ్‌ కమిటీ శ్రద్ధాంజలి సభను ఏర్పాటు చేసింది. 

వార్ధా: యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు భోజనం చేసిన తర్వాత తమ ప్లేట్లను తామే కడిగారు. మహాత్మాగాంధీ 150జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఉన్న మహాత్మా గాంధీ సేవాగ్రాం ఆశ్రమం (బాపు కుటీర్‌)లో మంగళవారం పార్టీ వర్కింగ్‌ కమిటీ శ్రద్ధాంజలి సభను ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి రాహుల్‌, సోనియాతోపాటు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు హాజరయ్యారు. 

శ్రద్ధాంజలి సభ అనంతరం కాంగ్రెస్ నేతలు బాపుకుటీర్ లోనే భోజనం చేశారు. భోజనం అనంతరం రాహుల్ గాంధీ, సోనియాగాంధీలు తమ ప్లేట్లను తామే కడిగారు. వారితోపాటు కాంగ్రెస్ నేతలు కూడా తమప్లేట్లను తామే కడిగారు. బాపు కుటీర్‌ మహాత్మాగాంధీ చివరి రోజులో గడిపిన ఇల్లు. రాహుల్‌ ఈ ఆశ్రమానికి రావడం ఇది రెండోసారి. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్లేట్లు కడిగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

బాపు కుటీర్ లో జరిగిన శ్రద్ధాంజలి సభలో గులాం నబీ ఆజాద్‌, సిద్ధరామయ్య, పుదుచ్చేరి సీఎం వి నారాయణస్వామి, మాజీ కేంద్ర మంత్రులు శివ్‌రాజ్‌ పాటిల్‌, సుశీల్‌కుమార్‌ షిండే, ఏకే ఆంటోని, హర్యానా మాజీ సీఎం బీఎస్‌ హుడా, ఉత్తరాఖండ్‌ మాజీసీఎం హరీష్‌ రావత్‌లు పాల్గొన్నారు. 

సుమారు 70 ఏళ్లుగా ప్రతీ ఏడాది సీడబ్ల్యూసీ సమావేశం ఈ సేవాగ్రాం విలేజ్ లో సమావేశమవుతూ వస్తోంది. 1942 జూలై 14న  క్విట్‌ ఇండియా ఉద్యమంపై బాపు కుటీర్ లోనే తీర్మానం చేశారు. ఆ తర్వాత 1942 ఆగస్టు 8న క్విట్‌ ఇండియా ఉద్యమం ముంబైలో ప్రారంభమైంది. 


 

: Sonia Gandhi and Rahul Gandhi wash their plates after lunch in Sevagram (Bapu Kuti) in Wardha. pic.twitter.com/hzC3AGe7kj

— ANI (@ANI)
click me!