సీఎం ఒకే అంటే.. వారానికి ఐదురోజులే పనిదినాలు

By ramya neerukondaFirst Published Oct 2, 2018, 4:25 PM IST
Highlights

వారానికి ఐదురోజుల పనిదినాలను అమలు చేస్తే బావుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పని సామర్థ్యాన్ని ఇది మరింత దోహదపడగలదు...’’ అని ఖర్గే పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో వారానికి ఐదు రోజులే పనిదినాలు కానున్నాయి. ముఖ్యమంత్రి ఒకే అంటే చాలు.. త్వరలోనే ఈ నిర్ణయం అమలులోకి రానుంది. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కాదులేండి. కర్ణాటకలో. ఇంతకీ మ్యాటరేంటంటే..

ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదురోజులే పనిదినాలు అమలు చేయాలని కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కుమారస్వామికి ఇటీవల ఆయన వినతి పత్రం అందజేశారు. ‘‘వారానికి ఐదురోజుల పనిదినాలను అమలు చేస్తే బావుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పని సామర్థ్యాన్ని ఇది మరింత దోహదపడగలదు...’’ అని ఖర్గే పేర్కొన్నారు.

 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా ఇదే విషయంపై పెద్దఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. కాగా సీఎం కుమారస్వామికి ఖర్గే ఆగస్టు 29నే లేఖ రాసినప్పటికీ.. నిన్న మధ్యాహ్నమే వెలుగులోకి రావడం గమనార్హం. దీనిపై కుమారస్వామి కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

click me!